పేదలకు సేవ చేయడం అభినందనీయం


Mon,April 22, 2019 02:56 AM

-పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పర్వతగిరి, ఏప్రిల్ 21 : పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం రావటం ఎంతో అభినందనీయమని, ప్రతి ఒక్కరూ తోచిన మేరకు ఇతరులకు సాయం చేయడం అలవాటు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని కల్లెడ గ్రామంలో ఆదివారం 21 మంది డ్రైవర్లకు ఓనర్‌షిప్ ధ్రువీకరణ పత్రాలు అందించిన సందర్భంగా పలువురు డ్రైవర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ జన్మించిన గ్రామానికి సేవ చేయాలనే తలంపు రావడమే అద్భుతమన్నారు. ఆర్‌డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు మారుమూల గ్రామం కల్లెడలో పైపుల కంపెనీ ప్రారంభించి, డ్రైవర్లకు వాహనాలను అందించి వారిని ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు. వృత్తిలో క్రమశిక్షణతో పనిచేసి, కష్టపడి రుణాలను తీర్చి, లాభాలు సాధించడం వారి కృషికి నిదర్శనమన్నారు. ఎవరైనా వారు ఎంచుకున్న రంగాల్లో కష్టపడి ముందుకు సాగాలని సూచించారు. యువత పురోగాభివృద్ధి సాధించడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ పుట్టిన గ్రామానికి సేవ చేయడానికి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు చేస్తున్న సేవను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నేటి సమాజంలో ఎవరికి వారు చైతన్యవంతులై తమ రంగాల్లో నైపుణ్యత ప్రదర్శించి, అభివృద్ది చెందాలన్నారు. ప్రజలందరి సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌డీఎఫ్ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, మనోజ్‌కుమార్‌గౌడ్, మేటిశెట్టి రాములు, శోభాపరమేశ్వర్‌రావు, రాజేశ్వర్‌రావు, మాధవరావు, శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...