కాంగ్రెస్ గూండాగిరి మానుకోవాలి


Sun,April 21, 2019 02:06 AM

నెక్కొండ, ఏప్రిల్20 : కాంగ్రెస్ నాయకులు వరుస ఓటములను తట్టుకోలేక ఎంపీపీ గటిక అజయ్‌కుమార్‌ను టార్గెట్ చేసి అతడిపై హత్యాయత్నానికి పూనుకున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. నెక్కొండలో శనివారం టీఆర్‌ఎస్ నేత గుండు సుధారాణి, ఎంపీపీ గటిక అజయ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ గుండా సంస్కృతికి బీజాలు వేస్తోందన్నారు. కాంగ్రెస్‌లో మిగిలిన ముగ్గురు, నలుగురు నేతలు నైరాశ్యానికి గురై ఎంపీపీని నిర్మూలిస్తే ఆధిపత్యం చేయవచ్చని కుట్రపూరితంగా దాడికి ఒడిగట్టారన్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎంపీపీ ఇంటిపై దాడికి కాంగ్రెస్ నాయకులు సాయంత్రం నుంచే ప్రణాళికను రచించి అమలు చేశారన్నారు. కాంగ్రెస్‌లోని గుండాలంతా ఓచోట చేరి ఎంపీపీని అంతమొందిచడానికి కుట్రలు చేశారని ఆరోపించారు. తాగిన మైకంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మారణాయుధాలతో ఎంపీపీ ఇంటిపై దాడికి పాల్పడ్డారన్నారు.

టీఆర్‌ఎస్ నాయకులు ఆ సమయంలో ఎంపీపీ ఇంట్లో ఉండి వారికి ఎదురొడ్డి నిలవడంతో ఎంపీపీ ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ఈ సందర్భంలో టీఆర్‌ఎస్ నాయకులు కొందరికి గాయాలయ్యాయన్నా రు. ఎంపీపీపై దాడికి ఏ కారణంలేదన్నారు. వ్యక్తిగతంగా ఎంపీపీని నిర్మూలించేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రకు తెరతీశారన్నా రు. కాంగ్రెస్ నాయకుడి తమ్ముడు సూసైడ్ నోట్‌రాశాడని పేర్కొంటూ సామాజిక మాద్యమాల్లో ఆ వార్తను వైరల్ చేశారని, ఆలేఖలో అతడి సంతకమే లేదన్నారు. ఆ లెటరు ఎవరు రాశారో పోలీసు విచారణలో తేలుతుందన్నారు. పోలీసు విచారణకు టీఆర్‌ఎస్ నాయకులు సహకరిస్తారన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులు చిల్లర వేశాలు వేస్తే తప్పకుండా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇకనైన నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ మహిళా నేత గుండు సుధారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు ప్రజల్లో గౌరవం పోయిందన్నారు. ఎంపీపీపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్‌నబీ, నాయకులు చెన్నకేశవరెడ్డి, శివకుమార్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు. .

గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని చోట్ల టీఆర్‌ఎస్ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండలో ఎంపీపీ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తగిన ప్రణాళికతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగిస్తోందన్నారు. ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...