రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులు


Sun,April 21, 2019 02:06 AM

నెక్కొండ, ఏప్రిల్ 20 : రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు ఇంటికి వచ్చి పథకం ప్రకారం తనపై దాడికి పాల్పడ్డారని ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ ఆరోపించారు. నెక్కొండలో శనివారం జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్‌నబీ, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు చల్లా చెన్నకేశవరెడ్డి, వైస్ ఎంపీపీ దొనికెన సారంగపాణి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. శుక్రవారం రాత్రి తన ఇంటిపైకి కాంగ్రెస్ నాయకులు దూసుకువచ్చి మారణాయుధాలతో దాడికి తెగబడ్డారని, దీనికి కారణం చూపించేందుకు ఘటనకు రంగులు పులుముతున్నారన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ అనే వ్యక్తి పేరిట ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ పెట్టి రాద్దాంతం చేస్తున్నారన్నారు. తనపై వ్యక్తిగత కక్షను పెంచుకున్న కాంగ్రెస్ నాయకులు రంజిత్‌రెడ్డి తదితరులు కుట్రపూరితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్‌లో కాంట్రాక్టు పద్ధ్దతిపై పనిచేస్తున్న శ్రీనివాస్ తన సొదరుడు కాంగ్రె స్ నాయకుడు హరిప్రసాద్‌తో కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున మద్యం బాటిళ్లు పంచుతూ కంటపడ్డారన్నారు. వీఆర్‌ఏ నిరంజన్, శ్రీనివాస్ తనను చూసి పారిపో గా మరుసటిరోజు వారిని పిలిచి ఇలాంటి వి చేయవద్దని సూచించానన్నారు. అయినా పద్ధతి మార్చుకోలేదన్నారు. ఈ విషయమై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న మార్కెట్ అధికారులు శ్రీనివాస్‌ను పక్కనపెట్టారన్నారు.

అయితే, శ్రీనివాస్ తనను శుక్రవారం ఉదయం కలిసి పొరపాటైందని అం గీకరించగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పానన్నారు. ఇవేమి పట్టించుకోకుండా రాత్రి శ్రీనివాస్ పేరిట ఫేస్‌బుక్‌లో ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ పోస్టు పెట్టార ని, పది నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ నాయకులంతా మారణాయుధాలతో ఇంటిపైకి వచ్చి దాడికి దిగారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎం పీఆర్‌వో విజయ్‌కుమార్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆయనపై బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారన్నారు. అబ్దుల్‌నబీ, చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రంజిత్‌రెడ్డి విర్రవీగుతూ దౌర్జన్యాలకు దిగడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని హెచ్చరించా రు. సమావేశంలో తాటిపెల్లి శివకుమార్, గన్ను కృష్ణ, లావుడ్యా హరికిషన్, వీరస్వామి, మాదాసు రవి, పుండరీకం, రాంచందర్, శ్రీకాంత్, యాకయ్య, మహబూబ్ పాష పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...