గెలుపు గుర్రాలకే టికెట్లు


Sun,April 21, 2019 02:06 AM

పరకాల, నమస్తే తెలంగాణ : రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. శనివారం హన్మకొండలోని ఆయన నివాసంలో పరకాల, నడికూడ మండలాల్లోని టీఆర్‌ఎస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక గురించి ఎమ్మెల్యే చర్చించారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను ఎక్కువ మంది ఆశిస్తున్నప్పటికీ గెలుపొందే వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు చెప్పారు. రెండు మండలాల్లో ఇప్పటికే ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతైందని, పోటీచేసేందుకు కూడా వారు ముందుకు రావడంలేదన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారన్నారు. మన లో మనం ఎక్కువ మంది పోటీలో ఉండి పార్టీకి నష్టం చేకూర్చొద్దన్నారు. స్వరాష్ట్రంలో తొలిసారిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని, రెండు మండలాల్లో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకునేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బీముడి నాగిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు బొల్లె భిక్షపతి, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పులి సారంగపాణి, నేతాని శ్రీనివాస్‌రెడ్డి, పావుశెట్టి వెంకన్న, చింతిరెడ్డి సాంబరెడ్డి, బొజ్జం రమేశ్, మునిగాల సురేందర్‌రావు, దగ్గు విజేందర్‌రావు, పాడి ప్రతాప్‌రెడ్డి, సాంబశివరెడ్డి, పర్నెం తిరుపతిరెడ్డి, నందికొండ జైపాల్‌రెడ్డి, ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...