నేడు ఆర్వో,ఏఆర్‌వోలకు రెండో దఫా శిక్షణ


Sat,April 20, 2019 01:56 AM

రూరల్ కలెక్టరేట్,ఏప్రిల్ 19: జిల్లా ప్రాదేశిక సభ్యుల,మండల ప్రాదేశిక సభ్యుల ఎన్నికలకు సంబంధించి నియమించిన రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం శనివారం జరుగుతుందని పరిషత్ ఎన్నికలకు నియమించిన జిల్లా లైజనింగ్ అధికారి,డీఆర్డీవో సంపత్‌రావు తెలిపారు. జిల్లాలోని 16 మండలాలకు చెందిన రిటర్నింగ్,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఒకే రోజు శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని నర్సంపేట,దుగ్గొండి,పర్వతగిరి,వర్థన్నపేట,సంగెం,పరకాల,నడికూడ,శాయంపేట మండలాలకు చెందిన ఆర్వో, ఏఆర్వోలకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.
మిగతా మండలాలైన నల్లబెల్లి,ఖానాపూర్,రాయపర్తి,చెన్నారావుపేట, నెక్కొండ,ఆత్మకూర్,దామెర,గీసుగొండకు సంబంధించిన రిటర్నింగ్,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో శిక్షణను ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలవుతుందని డీఆర్డీవో సంపత్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఆర్వో,ఏఆర్వోల మొదటి విడత శిక్షణా కార్యక్రమం 8,9 తేదీల్లో జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కాగా ప్రాదేశిక సభ్యుల ఎన్నికల కోసం నియమించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 13న జిల్లాలోని ఆయా మండలాల్లోని పరిషత్ కార్యాలయాల్లో మొదటి విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వీరికి రెండో దఫా శిక్షణా కార్యక్రమాన్ని రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి అయిన తర్వాత ఇవ్వనున్నట్లు సంపత్ రావు తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...