గెలుపే ధ్యేయంగా పనిచేయాలి


Sat,April 20, 2019 01:55 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 19: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో పనిచేసే నాయకులు, కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలకు అవకాశం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీ బలరపరిచిన అభ్యర్థులనే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలాగే అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామాలకు ఇన్‌చార్జీలను నియమించడం జరిగిందన్నారు. ఇన్‌చార్జీలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా ఉంటూ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. చాలా గ్రామాల్లో ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. అలాగే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అనంతరం గ్రామాల వారిగా ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. కాగా సమావేశానికి గ్రామాల వారీగా ఆశావాహులు పెద్ద ఎత్తున తమ మద్దతుదారులను క్యాంపు కార్యాలయానికి తీసుకు రావడంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఈ సమావేశంలో కూడా చైర్మన్, ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి యదవరెడ్డి, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, మండల పార్టీ అధ్యక్షుడు మార్గం భిక్షపతి, మండల ఎన్నికల ఇన్‌చార్జి సుదర్శన్, పార్టీ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...