మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పెద్ది పరామర్శ


Sat,April 20, 2019 01:55 AM

నర్సంపేట రూరల్, ఏప్రిల్19: మండలంలోని మాధన్నపేట గ్రామంలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగుల పాపయ్య (55) గురువారం ఉదయం తన వ్యవసాయ భూమిలోని మిరప పొరక ఏరేందుకు వెళ్లాడు. రెండు రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. దీంతో పాపయ్య వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో బంధువులు వైద్యం చేయించారు. కాగా గురువారం సాయంత్రం నర్సంపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం పాపయ్య మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య పుషమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడున్నారు. ఈ విషయం తెలుసుకున్న నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, సర్పంచ్, మాజీ సర్పంచ్ ఆకుతోట కుమారస్వామి, దేశిని సుదర్శన్, కట్టయ్య, వెంకటయ్య, నాయకులు గడ్డం నర్సయ్య, మొలుగూరి మెండయ్య, నర్సింహరాములు, మొలుగూరి సుదర్శన్, దేశిని ఆనంద్, రంజిత్, జినుకల నర్సయ్య, ఎం నర్సయ్య తదితరులున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...