ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా


Fri,April 19, 2019 03:04 AM

- ప్రథమ సంవత్సరం 43శాతం
- ద్వితీయ సంవత్సరం 51శాతం
- గతేడాదితో పోలిస్తే తగ్గిన ఉత్తీర్ణత

నర్సంపేట, నమస్తే తెలంగాణ : ఇంటర్మీడియెట్ ఫలితా ల్లో అమ్మాయిలే పై చేయి సాధించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ, వొకేషనల్ పరీక్షల ఫలితాలను గురువారం సా యంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఇంటర్మీడియెట్ బోర్డు కా ర్యాలయంలో విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డీఐఈవో జితేందర్‌రెడ్డి ఫలితాలను ప్రకటించా రు. జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియెట్ మొదటి, సెకండియర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెండో సంవత్సరం 51 శాతం, మొదటి సంవత్సరం 43శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే జిల్లా 22వ స్థానంలో నిలిచింది. అయితే, గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. ఈ యేడు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 51 శాతం ఉత్తీర్ణత సా ధించగా, గతే ఏడాది రెండో సంవత్సరంలో 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ప్రథమ సంవత్సరం 57 శాతం గా ఉత్తీర్ణత సాధించగా, ఈయేడు ప్రథమ సంవత్సరంలో 43శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో వరంగల్ జిల్లాలో బాలుర కంటే బాలికలదే పై చేయిగా కొనసాగింది.

ద్వితీయ సంవత్సరం ఫలితాలు..
జిల్లాలో 4,806 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 2,471 మంది ఉత్తీర్ణత సాధించడంతో 51 శాతంగా నమోదైంది. ఇందులో బాలురు 2,391 పరీక్షలకు హాజరు కాగా, కేవలం 1,079 మంది(45శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 2,415 మంది హాజరు కాగా 1,392 మంది(57శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ రెండో సంవత్సరం విద్యార్థులు 687 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 459 మంది(67శాతం) ఉత్తీర్ణత సాధించారు.

ప్రథమ సంవత్సరం ఫలితాలు..
ఇంటర్ మొదటి సంవత్సరం 4,985 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 2,162 మంది(43శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 2,439 మందికి కేవలం 907 మంది(37 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,546 మంది పరీక్షలకు హాజరుకాగా, 1,255 మంది(49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విద్యార్థులు 756 మంది పరీక్షలు రాయగా వారిలో 450 మంది ఉత్తీర్ణత సాధించారు.

నర్సంపేట విద్యార్థికి స్టేట్ రెండో ర్యాంకు..
నర్సంపేటలో కాకతీయ గ్రాడ్యుయేట్స్ కళాశాలకు చెంది న విద్యార్థి రాష్ట్రంలో రెండో ర్యాంకును సాధించారు. ఎంపీసీ విభాగంలో పీ సుభాశ్ చంద్రబోస్ 989 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సాధించారు. ఎంఈ సీ విభాగంలో ఎం శ్రీకాంత్ 973 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకును సాధించారు.

జ్యోతిబాఫూలే విద్యార్థి ప్రతిభ
శాయంపేట : శాయంపేటలోని మహాత్మ జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాల విద్యార్థులు ఇం టర్ ఫలితాల్లో ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ మనోహర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇంటర్ ప్రథమ, ద్వితీ య ఫలితాలు వెల్లడి కావడంతో క ళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతి భ చూపినట్లు తెలిపారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బొల్లెపల్లి రాకేశ్ 965 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే ద్వి తీయ సంవత్సరం బైపీసీలో 889 మార్కులతో ఎండీ ఆలీ, సఈసీలో 925 మార్కులతో సాయికిరణ్ ప్రతిభ చూపినట్లు తెలిపారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 22 మంది విద్యార్థులకు 14 మందితో 64 శాతం ఉ త్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బైపీసీలో 16 మందికి 11 మందితో 69 శాతం ఉత్తీర్ణత, సీఈసీలో 30 మంది విద్యార్థులకు 27 మందితో 90 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొత్తం ద్వితీయ సంవత్సరంలో 68 మంది విద్యార్థులకు 52 మంది విద్యార్థులు పరీక్షరాయగా 76 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో వీ రాము 448, బైపీసీలో సలీం 397, సీఈసీలో ప్రీతమ్ 464, ఎంఈసీలో రోహిత్ 312 మార్కులతో ప్రతిభ చూపినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 36 మందికి 26 మందితో 72 శాతం ఉత్తీర్ణత, బైపీసీలో 30 మందికి 21 మందితో 70శాతం, సీఈసీలో 39 మందికి 28 మందితో 72 శాతం, ఎంఈసీలో 14 మందిలో ఇద్దరే అంటే 14 ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు.

ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..
శాయంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్‌మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సా ధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు. ఈమేరకు గురువా రం వెల్లడైన ఫలితాలను ఆయన తెలియజేశారు. ఎంపీసీ సెకండ్ ఇయర్‌లో 727 మార్కులతో విద్యార్థి సాయిచంద్ టాపర్‌గా నిలిచినట్లు తెలిపారు. అలాగే స్వాతీ 695 మా ర్కులు, బైపీసీలో కావ్య 860 మార్కులు, సాయికృష్ణ 778 మార్కులు, సీఈసీలో భరత్ 746 మార్కులు, దీపిక 713 మార్కులు సాధించి ప్రతిభ చూపినట్లు తెలిపారు. అలాగే ఫస్ట్ ఇయర్‌లో బైపీసీలో స్వీటీ 278 మార్కులు, సీఈసీలో లక్ష్మి 253, నాగరాజు 233 మార్కులు సాధించినట్లు తెలిపారు. కళాశాల నుంచి విద్యార్థులు మంచి ఫలితాలు సా ధించిడంపై సంతోషం వ్యక్తం చేశారు.

మోడల్‌స్కూల్‌లో ఉత్తమ ఫలితాలు
ఖానాపురం : మండలంలోని బుధరావుపేట మోడల్‌స్కూల్‌కు చెందిన విద్యార్థులు గురువారం ప్రకటించిన ఇం టర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించారు. మోడల్‌స్కూల్‌కు చెందిన ఎంపీసీ విద్యార్థి భూక్య గణేశ్ ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 470 మార్కులకు గానూ 461 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఇంటర్ సెకండియర్ బైపీసీకి చెందిన ఎస్‌కే అస్మా 1000 మార్కులకు గానూ 972 మార్కులు సాధించి మం చి ప్రతిభ కనబరిచింది. దీంతో విద్యార్థులను ప్రిన్సిపాల్ రవి, ఉపాధ్యాయులు అభినందించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...