హరితహారం మొక్కలను సంరక్షించాలి


Fri,April 19, 2019 03:03 AM

- ఎంజీవీఎన్ ఫారెస్ట్ రిటైర్ట్ ఆఫీసర్ విజయ్‌కుమార్
చెన్నారావుపేట, ఏప్రిల్ 18 : గ్రామాల్లోని వననర్సరీల్లో పెంచుతున్న హరితహారం మొక్కలను సంరక్షించాలని ఎం జీవీఎన్ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గురిజాల, గుంటూరుపల్లె గ్రా మాలలోని వన నర్సరీలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో వన్ జీపీ వన్ నర్సరీ పేరు మీద ప్రభుత్వం వన నర్సరీలను ఏర్పాటు చేసి మట్టితో కూడిన బ్యాగుల్లో టేకు స్టంపులు, పండ్లు, నీడనిచ్చే వివిధ రకాల మొక్కలను పెట్టించిందన్నారు. వాటికి ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం నీటి ని అందిస్తూ విధిగా సంరక్షించాలని సూ చించారు. రానున్న వర్షాకాలంలో ఎదిగిన మొక్కలను హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రా మాల్లోని రైతులు, గ్రామస్తులకు అందించాలన్నారు. పం డ్లు, నీడనిచ్చే మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసి హరితహారంలో నాటించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. వన నర్సరీల విషయంపై ఎవరూ నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధిహామీ నర్సంపేట ఏపీడీ పారిజాతం, ఎంపీడీవో చందర్, ఏపీవో అరుణ, ఈసీ కిశోర్, పంచాయతీ కార్యదర్శి రాజమౌళి, ఫీల్డ్‌అసిస్టెంట్ జానకి, తదితరులున్నారు.

n నర్సంపేట రూరల్ : వన్ జీపీ వన్ నర్సరీలో మొక్కల పెంపకం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఎన్‌జీవీఎన్ రిటైర్డ్ ఫారెస్టు ఆఫీసర్ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ నర్సరీని విజయ్‌కుమార్, నర్సంపేట ఏపీడీ పారిజాతంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి, ఫారెస్టు అధికారులు, సిబ్బంది నర్సరీ మొక్కల పెంపకంలో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. టేకు మొక్కలతో పాటు 47రకాల మొక్కల్ని పెంచి సంరక్షించి ప్రజలకు అందించాలని కోరారు. హౌజ్ ప్లాంటేషన్, ఫారెస్టు ప్లాంటేషన్‌లో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చెన్నారావుపేట ఏపీవో అరుణ, గ్రామ సర్పంచ్ పెండ్యాల జ్యోతిప్రభాకర్, ఉపాధి సిబ్బం ది, వన సేవకులు తదితరులున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...