పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి


Fri,April 19, 2019 03:03 AM

గీసుగొండ, ఏప్రిల్ 18 : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని ఎంపీడీవో రమేశ్ సూచించారు. గురువారం మండలంలోని హర్జ్యతండా, కొమ్మాల గ్రామా ల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీపీడో మాట్లాడుతూ 21 గ్రామాల్లో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపా రు. కేంద్రాల్లో మరుగుదొడ్లు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, విద్యుత్, తాగునీరు సౌకర్యాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శేషు, సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, కార్యదర్శులు ప్రవీణ్, సుమన్, రమ్య, శారద, సహజ, మహేశ్, దినేశ్, రంజిత్ పాల్గొన్నారు.

మనుబోతుల గడ్డలో..
ఖానాపురం : మండలంలోని మనుబోతులగడ్డగ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించినట్లు గ్రామ కార్యదర్శి కాసుల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లెపు సోమయ్య, ఉపసర్పంచ్ యాకయ్య, ఖానాపురం ఈవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...