రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు


Thu,April 18, 2019 01:46 AM

- రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
- స్థానికంగానే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం
- మూడు రోజుల్లోనే నగదు ఆన్‌లైన్ చెల్లింపులు
- ఏకేపీ సీసీలు స్వామి, దేవేంద్ర

రాయపర్తి, ఏప్రిల్ 17 : వ్యవసాయ రంగానికి చేయూతను అందించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని రైతులు మార్కెటింగ్ మో సాలకు గురికాకుండా కాపాడాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ యా సంగి, వానకాలం సీజన్‌లలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఇందిరాక్రాంతి పథకం కమ్యూనిటీ కోఆర్డినేటర్‌లు మునావత్ స్వామినాయక్, దేవేంద్రలు తెలిపారు. మండలంలోని సన్నూరు గ్రామంలో ఐకేపీ నేతృత్వం లో మహిళా సంఘాల నిర్వాహణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాలను వారు బుధవారం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, వరి ధాన్యంను నగరాలు, పట్టణాలలోని మార్కెట్‌లలో విక్రయించేందుకు తరలిస్తూ అనేక వ్యయ ప్రయాసాలకు గురవుతున్నట్లు చెప్పారు.

బహిరంగ మార్కెట్‌లలో మధ్య దళారుల వ్యవస్థల కారణంగా రైతులు పం డించిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులందరూ పండించిన వరి ధా న్యాన్ని కొనుగోలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు మూడు రోజుల్లోనే రై తులకు ఆన్‌లైన్ పద్ధతులలో నగదుల చెల్లింపులు జరుగుతాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సన్నూ రు, వెంకటేశ్వరపల్లి, జయరాంతండ(ఎస్), బాల్‌నాయక్ తండా గ్రామాల సర్పంచ్‌లు నలమాస సారయ్య, గూబ యాకమ్మ, బానోత్ పద్మ, మంద సునీత, బానోత్ జగన్‌నాయక్, గణేశ్ గ్రామైఖ్య సంఘం ప్రతినిధులు, వీవోఏలు దీకొండ శోభ, కొనుకటి లక్ష్మి, పెదగాని రాధిక, యాకలక్ష్మి, పెదగాని వెంకన్నగౌడ్, సరిత, కే రమాదేవి, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...