పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


Thu,April 18, 2019 01:46 AM

రూరల్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. బుధవారం హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 27 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.14 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నియోజకవర్గంలోని ముచ్చర్లకు చెందిన రఘుకు రూ.6500, తిమ్మాపూర్‌కు చెందిన పవన్‌కు రూ.1,50లక్షలు, సీతంపేటకు చెందిన చేరాలుకు రూ.26,000 లను, సిద్ధ్దాపురానికి చెందిన రాజేందర్‌కు రూ.60,000, నక్కలపెల్లికి చెందిన నిర్మలకు రూ.8,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా అభివృద్ది, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం పయనించాలన్నా, సంక్షేమ ఫలాలు గడప గడపకు చేరాలన్నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి అత్యధిక స్థానాలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచారన్నారు. కార్యక్రమంలో 57వ డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, జక్కు రమేశ్, రాజేందర్, కిరణ్, తిరుపతి, సాంబరెడ్డి, సదానందం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల సంక్షేమానికి పెద్దపీట
రూరల్ కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కట్య్రాల గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఎండీ మదర్ పాషాకు నూతనంగా ట్రై సైకిల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. వికలాంగుల ప్రగతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండి రజినీ కుమార్, ఇండ్ల నాగేశ్వర్ రావు, తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...