20, 22 తేదీల్లో మైనార్టీ గురుకులాల ప్రవేశ పరీక్ష


Thu,April 18, 2019 01:46 AM

రూరల్ కలెక్టరేట్,ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని మూడు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో 2019-20 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందుటకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 20, 22 తేదీల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎం నర్సింహస్వామి తెలిపారు. ఈ నెల 20న 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 22వ తేదీన 6,7,8 తరగతుల వారికి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్ష నిర్వహణకు గంట ముందుగా కేంద్రాలకు హాజరుకావాలని ఆయన కోరారు. విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటో తప్పని సరిగా తీసుకు రావాలని ఒక ప్రకటనలో వివరించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...