భానుడి భగభగ...


Wed,April 17, 2019 02:12 AM

- రోజురోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
- మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా రహదారులు
- వేడిగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
- అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

చెన్నారావుపేట విలేకరి : జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం 10 గంటలు కాకముందే ఎండలు భగభగ మండుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మంగళవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం వేళ రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండలు ఇలా ఉంటే.. మే నెలలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. శీతలపానీయాలతో ఉపశమనం పొందుతున్నారు. రంజన్లు, కూలర్లు, ఫ్రిజ్‌ల కొనుగోళ్లు బాగా పెరిగాయి. ప్రజలు అత్యవసరమైతేనే ఎండలో బయటకు వెళ్లాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఎక్కువ నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

జిల్లాలో దంచి కొడుతున్న ఎండలకు ప్రజలు బెంబేలెత్తున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతూ ప్రజలను విలవిలలాడిస్తున్నాడు. పక్షం రోజులుగా గరిష్ఠంగా 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గకుండా ఎండలు మండుతున్నాయి. గ్రామాలన్నీ నిప్పు కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందే ఎండలు భగభగ మండుతున్నాయి. మధ్యాహ్నం వేళ రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోనకు గురవుతున్నారు. మంగళవారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు నమోదైంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. ఇప్పడే ఇలా ఉంటే మే మాసంలో ఎండల పరిస్థితి ఎంటని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

- చెన్నారావుపేట, విలేకరి వ్యాపారులకు తప్పని తిప్పలు..
ఎండ ప్రభావంతో చిరు వ్యాపారులు పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్ల పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఎండలు ఇబ్బందిగా పరిణమించాయి. తప్పని పరిస్థితుల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి గొడుగులను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు, చిన్నారులు, వృద్ధులకు సైతం ఎండ తిప్పలు తప్పడం లేదు. అంతేకాకుండా ఉద్యోగుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రామాల్లోని రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల సమయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు రోడ్ల పైకి రావాలంటే ఎండ వేడిమికి జంకుతున్నారు.

ఉపశమనం కోసం ప్రత్యామ్నాయం..
చలికాలం పోయి ఎండాకాలం ఆరంభం కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా బాగా పెరిగి పోయాయి.ఈ క్రమంలో ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే ప్రజలు తగిన ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీల విక్రయాలు బాగా పెరిగిపోయాయి. మార్కెట్లలో వ్యాపారులు పెద్ద ఎత్తున వీటిని దిగుమతి చేసి అమ్మకాలు చేపడుతున్నారు. కాస్తా డబ్బులు ఉన్న వారు వీటిని ఆశ్రయిస్తుండగా ఇక పేదలు మాత్రం చల్లని నీటి కుండలు, రంజన్లను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా చెట్ల కింద సేద తీరుతూ కనిపిస్తున్నారు. అదేవిధంగా దాహార్తి తీర్చేందుకు కొబ్బరి బోండాలు, జ్యూస్‌లు, నిమ్మరసం, చెరుకు రసం, పుచ్చకాయలు మార్కెట్‌లోకి విరివిగా వచ్చేశాయి. వీటితో మధ్యాహ్నం వేళ ఉపశమనం పొందుతున్నారు. ఒక వేళ ఎండలో తప్పనిపరిస్థితిలో బయటికి వెళ్లాలంటే తలపాగ, టోపీలను ధరించుకుని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గొడుగుల వినియోగం కూడా బాగా పెరిగి పోయింది. ఎక్కువగా ఎండలో ప్రయాణం చేయాల్సి వస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని, ఎండ వేడిమి నుంచి ప్రజలు బయట పడేందుకు తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నీటిని ఎక్కువగా తాగాలి
ఉషారాణి, వైద్యాధికారి చెన్నారావుపేట, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగి పో తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరి గి పోవడంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. ఎండలో ఎక్కువగా ఉం డే వారు డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో వడ దెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతీఒక్కరూ ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలి లేదా కొబ్బరి బోండాలను తీసుకుంటే ఇంకా చాలా మంచిది.

బయటకి వెళ్లాలంటే భయమేస్తోంది
- పోలెపల్లి భిక్షఫతి చెన్నారావుపేట
రోజురోజుకూ ఎండలు విపరీతం గా పెరిగి పోతున్నాయి. దీంతో మధ్యా హ్నం వేళలో బయటికి వెళ్లాలంటే భయమేస్తోంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. రానున్న మే నెలలో ఎండలను తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. ఏమైనా పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకుంటున్నాం.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...