అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన


Wed,April 17, 2019 02:11 AM

పరకాల, నమస్తే తెలంగాణ : అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా పరకాల ఫైర్‌స్టేషన్ సిబ్బంది మంగళవారం ప్రజలకు అగ్ని ప్రమాదాల పై అవగాహన కల్పించారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ సమ్మయ్య ప్రజలకు గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జనార్దన్, సత్తయ్య, రవీందర్, రఘుపాల్, పున్నంచందర్ పాల్గొన్నారు.

వంట గ్యాస్‌పై అవగాహన
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : అగ్నిమాపకశాఖ వారోత్సవాల్లో భా గంగా వంటగ్యాస్ వాడకంలో ప్ర మాదాల నివారణపై ఫైర్ అధికారులు మండల కేంద్రంలోని ఫిరంగిగడ్డలో మహిళలకు అవగాహన కల్పి ంచారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారి అయూబ్ మాట్లాడుతూ గ్యాస్‌స్టౌపై వంట చేసే సమయంలో జాగ్రత్తగా గ్యాస్ పైపును, ఆన్ ఆఫ్ స్విచ్‌లను పరిశీలించాలన్నారు. వంట పూర్తి కాగానే రెగ్యులేటర్ వద్ద గ్యాస్ బయటకు రాకుండా బంద్ చేయాలని సూచించారు. వంట గ్యాస్ పై పు వద్ద లీకేజీ ఉన్నట్లయితే వెంటనే స్టౌను బంద్ చేసి రెగ్యులేటర్ పైపు ను తీసివేయాలని సూచించారు. ఒకవేళ పైపు వద్ద మంటలు వచ్చినట్లయితే వెంటనే అప్రమత్తమే బయటకు వెళ్లాలన్నా రు. మంటలు వస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. ప్రధానంగా గ్యాస్‌ను వెలుతురు వున్న వంట గదిలోనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది శ్యాంసుందర్, జయపాల్‌రెడ్డి, యాకయ్య, కృష్ణకుమార్, రాజేందర్, అక్బర్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...