రైతుల కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు


Wed,April 17, 2019 02:10 AM

రాయపర్తి, ఏప్రిల్ 16 : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని రైతాంగానికి మేలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్‌మార్కెట్ యార్డులో ఐకేపీ నేతృత్వంలో మహిళా సంఘాల నిర్వాహణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిధిగా హాజరై మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించే విషయంలో గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి విక్రయించిన రైతులకు సకాలంలోనే చెల్లింపులు జరిగేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కె ట్ వైస్ చైర్మన్ ఎండీ నయీం, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఐకేపీ ఏపీడీ శేఖర్, ఏపీఎం నెల్లుట్ల రమాదేవి, సీసీ అనిత, స్థానిక సర్పంచ్ గారె నర్సయ్య, పలు సంఘాల ప్రతినిధులు బందెల బాలరా జు, తౌడిశెట్టి రామారావు, అయిత కు మార్, హసీన, యాకయ్య, పుష్ప, రజి యా, రహీమున్నీసా, స్వప్న, ఉషళిక, భాగ్యలక్ష్మి, మధుసూదన్, శ్రీనివాస్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

ఐదు గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభం
ఐకేపీ నేతృత్వంలో మండలంలోని మరో ఐదు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పలు శాఖల అధికారులు ప్రారంభించారు. మండలంలోని రాగన్నగూడెం, కొత్తూరు, పెర్కవేడు, సన్నూరు, కాట్రపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు.. వాటిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాలలో పలు సంఘాల ప్రతినిధులు బొమ్మెర రమాదేవి, అలివేలు మంగమ్మ, సంధ్యారాణి, వీరస్వామి, యాకాంతం, యాదగిరి, ఎల్లయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...