ప్రశాంతంగా పాలిసెట్-2019


Wed,April 17, 2019 02:10 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి మంగళవారం నిర్వహించిన పాలిసెట్-2019 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ రూరల్ జిల్లాలో పరకాలలో మాత్రమే రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 826 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 400 మందికి 395 మంది హాజరు కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 426 మందికి 425 మంది హాజరయ్యారు. వేసవి కావడంతో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, చల్లటి మంచినీటిని అందుబాటులో ఉంచారు. మొత్తం రెండు కేంద్రాల్లో కలిపి ఆరుగురు విద్యార్థులు మాత్రమే గైర్హాజరైనట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. పరీక్షకు 99.27 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...