బీమాతో ధీమా


Tue,April 16, 2019 02:07 AM

- ఆపదలో అండగా నిలుస్తున్న రైతు బీమా
- జిల్లాలో నేటికి 217 కుటుంబాలకు లబ్ధి
- రూ.10.35 కోట్ల మేరకు అందిన పరిహారం
- వారం రోజుల్లో నామిని బ్యాంక్ ఖాతాలో రూ.5లక్షలు జమ
- సర్కారు పథకానికి రైతుల సలాం

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 15 : దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. రైతు అకాలమరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూస్తున్నది. రైతు బీమాతో ఆపద సమయంలో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. సమైక్య పాలకులు కేవలం ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి అరకొర సాయంతో సరిపెట్టేవారు. స్వరాష్ట్రంలో రైతు కుటుంబాల కన్నీరు తుడిచేందుకు సీఎం కేసీఆర్ రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. గతేడాది ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతు ఏ కారణం చేత మృతిచెందినా నేరుగా నామిని ఖాతాలో రూ.5లక్షల పరిహారాన్ని జమ చేస్తున్నారు. జిల్లాలో నేటి వరకు 217 రైతు కుటుంబాలకు మొత్తం రూ.10.35 కోట్ల మేరకు పరిహారం అందజేశారు. సర్కారు నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆరుగాలం కష్టపడే అన్నదాతల కుటుంబాలకు రైతుబీమా అండగా నిలుస్తున్న ది. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకంతో పాటుగా రైతుబీమా పథకాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నది. కు టుంబపెద్ద అకాల మరణం చెందితే ఆ కటుంబం ఎన్నో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు గ్రామాల్లో అనేకం కనిపిస్తూ ఉంటా యి. గత పాలకులు అరకొర సహాయాన్ని అందిస్తే ఆ కుటుంబానికి ఏమాత్రం న్యాయం జరిగేదికాదు. దీనిని గ్రహించిన రా ష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అకాల మరణం చెందిన ఆ కు టుంబానికి సరైన న్యాయం జరగాలనే లక్ష్యంతో పాలసీ మొత్తా న్ని ప్రభుత్వమే భరించి రైతు సామూహిక బీమా చేయించేలా రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతు ఏకారణం చేత మరిణించినా ఆ కటుంబానికి రూ.5లక్షల పరిహారం అందేలా పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా సమగ్రమైన సర్వే చే యించి అర్హులైన రైతులకు గతేడాది ఆగస్టు 14నుంచి బీమా వసతి కల్పించింది. దీంతో రైతు మృతి చెందినట్లయితే మృతుడి కుటుంబానికి రూ.5లక్షల పరిహారాన్ని వారం నుంచి పది రోజులోపే అందిస్తున్నది. ఇప్పటి వరకు వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 207 రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మొత్తంగా రూ.10.35 కోట్ల పరిహారాన్ని మంజూరు చేయగా మరో 10 కుటుంబాలకు సంబంధించిన పరిహారాన్ని వారం రోజుల్లో మంజూరు కానున్నాయి.

జిల్లాలో 217 కుటుంబాలకు లబ్ధి..
వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 207 కుటుంబాలకు ఇ ప్పటి వరకు రైతుబీమా పథకం ద్వారా లబ్ధి చేకూరగా మరో 10 కుటుంబాలకు త్వరలోనే పరిహారం మంజూరు కానున్నది. గతే డాది వ్యవసాయశాఖ ద్వారా జిల్లాలోని 15 మండలాల పరిధి లో ఉన్న 265 గ్రామాల్లో సర్వే నిర్వహించారు. జిల్లాలో మొ త్తంగా 1,71,615 మంది రైతులను సర్వే చేయగా రైతుబీమా పథకానికి 1,01,220 మంది రైతులను అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరికీ కూడా ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లించి రైతు ఏకారణం చేత మృతి చెందినా రూ.5లక్షల పరిహారం అందించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఏప్రిల్ 4వ తేదీ వరకు 217 మంది రైతులకు ప్రభుత్వం జీవిత బీమా సంస్థ నుంచి రూ.5 లక్షల ప రిహారం అందించింది. ఇందులో పరకాల డివిజన్ పరిధిలోని ఆత్మకూరులో 16 కుటుంబాలకు, దామెర లో 10, గీసుగొండలో 24, పర్కాలలో 29, సంగెంలో 8, శా యం పేటలో 11 కుటుంబాలకు పరిహారం అందింది. అలాగే వర్ధన్నపే ట డివజన్ పరిధిలోని పర్వతగిరిలో 12 కుటుంబాలకు, రాయపర్తిలో 15, వ ర్ధన్నపేటలో 13 కుటుంబాలకు, నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేటలో 17, దుగ్గొండిలో 14, ఖానాపూర్‌లో 4, నల్లబెల్లిలో 15, నర్సంపేటలో 12, నెక్కొండలో 17 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం అందింది. జిల్లాలో మొ త్తంగా ఏప్రిల్ 4వ తేదీ వరకు 217 రైతు కటుంబాలకు పరిహారం అం దింది.

నేరుగా నామిని బ్యాంకు ఖాతాలో జమ..
రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా నేరుగా లబ్ధిదారుడికే చేరేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రైతుబీమా పథకంలో ఏమాత్రం దళారుల బెడద లేకుండా నేరుగా మృతి చెందిన రై తు కుటుంబానికి లభ్ధి చేకూరేలా ఏర్పాట్లు చే శారు. రైతు మృతి చెందితే వెంటనే జిల్లా అధికారులకు మండల వ్యవసాయాధికారి ద్వారా సమాచారం అందిస్తారు. అంతేగాక నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతు డెత్‌సర్టిఫికేట్‌తో పాటుగా నామినీ ఆధార్‌కార్డు, పట్టాదార్ పాస్‌పుస్తకం, నామినీ బ్యాంకు పాస్‌పుస్తకం జిరాక్స్‌లను రైతు కుటుం బ సభ్యులు ఏఈవోలకు అందజేయాలి. దీంతో మృతి చెందిన రైతు, నామినీ వివరాలను ఆన్‌లైన్ ద్వారా జిల్లా, రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి మండల వ్యవసాయశాఖ అధికారి ద్వారా అందజేస్తారు. జీవిత బీమాకు కూడా పూర్తి వివరాలను ఆన్‌లైన్ ద్వారానే పంపిస్తారు. దీంతో అధికారులు కూడా సమగ్రంగా స మాచారం సరిచూసి రైతు నామినీ పేరిట పరిహారాన్ని మంజూ రు చేసి నామినీ ఖాతాలోకి నేరుగా రూ.5 లక్షలను బదలాయిస్తారు. ప్రభుత్వం బీమా ద్వారా రూ.5లక్షలు అందిస్తుండడంతో పేద కుటుంబాలకు చెందిన రైతు కుటంబ సభ్యులకు కొంత మేరకు న్యాయం జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

గతంలో ఆత్మహత్యలకు మాత్రమే ..
గత ప్రభుత్వాల హయాంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం పరిహారాన్ని అందించడం జరిగేది. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే రైతు కుటుంబ సభ్యులు కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిహారం అందడం గగనంగా మారేది. గత పాలకులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.6లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించినప్పటికీ చాలా కుటుంబాలకు పరిహారం అందలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు అనారోగ్యంతోగాని, ప్రమాదంలోగాని, ఇతర ఏ కారణంచేత మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందేలా రైతుబీమా పథకాన్ని రూపొందించడంతో పాటుగా సత్వరమే పరిహారం అందేలా చేస్తున్నది. దీంతో రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది.

మా కుటుంబానికి సీఎం కేసీఆర్ సార్ అండ..
డ్యాగల కొమురయ్య తనకున్న మూడున్నర ఎకరాలలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కూతుర్ల వివాహం చేయడంతో ఆర్థిక ఇబ్బందుల మూలంగా కొడుకును ఉన్నత చదువులు చదివించలేకపోయిండు. దీంతో భార్య సమ్మక్కతో పాటుగా పదో తరగతి పూర్తి చేసిన మహేశ్ కూడా పొలం పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మార్చి 11, 2019 రోజున బావి వద్ద కొమురయ్యను పాము కరవడంతో మృతి చెండాడు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు కొమురయ్య మృతికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో మార్చి 30వ తేదీన సమ్మక్క బ్యాంకు ఖాతాలో రైతుబీమా పథకంలో భాగంగా జీవిత బీమా సంస్థ నుంచి రూ.5లక్షలు జమ అయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆ కుటుంబానికి ఊరట లభించింది. మాకు సీఎం కేసీఆర్ అందించిన సహాయాన్ని మరవలేమని డ్యాగల సమ్మక్క, ఆమె కుమారుడు మహేష్ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఇందుకు సహకరించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- డ్యాగల సమ్మక్క, (కొమురయ్య భార్య)

నామినికి పరిహారం అందుతుంది
రైతు అకాల మరణం చెందితే ఆయన నామినికి ప్రభుత్వం నుం చి పరిహారం అందుతుంది. రైతు మృతి చెందగానే ఏఈవో ద్వారా ఆయన వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించడం జరుగుతుంది. ప్రధానంగా రైతు మృతి చెందిన తరువాత డెత్ సర్టిఫికేట్, నామినీ ఆధార్ కార్డు, బ్యాంకుఖాతా పుస్తకం జిరాక్స్‌లు అవసరం ఉంటుంది. మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికేట్ జారిఅయ్యే విషయంలో కూడా వ్యవసాయశాఖ అధికారులు సహకారం అందించి సర్టిఫికేట్‌లు తెప్పించి ఆన్‌లైన్‌లో వివరాలను రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి చేరవేయడం జరుగుతంది. రైతు మృతి చెందిన వారం నుంచి 10 రోజులలోపే నామినీ ఖాతాలో ప్రభుత్వం జమ చేయిస్తున్నది. ఈ పథకం మృతి చెందిన రైతు కుటుంబాలకు ఎంతో ఊరటను కలిగిస్తున్నది.
- విమ్మిడిశెట్టి సురేశ్‌కుమార్, ఏడీఏ

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...