తాటివనంలో అగ్నికీలలు


Tue,April 16, 2019 02:06 AM

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల పట్టణ శివార్లలోని తాటివనంలో మంటలు ఎగిసిపడ్డాయి. పరకాల-మొగుళ్లపల్లి ప్రధాన రహదారిలో ప్రమాదవశాత్తు చెత్తకు నిప్పంటుకుని ఆ నిప్పు కాస్త మంటలుగా మారి కట్టపై ఉన్న తాటిచెట్లను అంటుకున్నాయి. కట్టకు ఇరువైపులా తాటిచెట్లు కాలుతూ మంటలు పరకాల-రాయపర్తి రోడ్డులోని శ్రీరామ, మహేశ్వర ఇండస్ట్రీస్ వరకు వ్యాపించాయి. ఈ మంటలతో రెండు మిల్లులు కాలిబూడిదయ్యే పరిస్థితి ఏర్పడగా పరకాల, కాకతీయ థర్మల్ పవర్‌ప్లాంట్, ములుగు ఫైర్ ఇంజిన్లు వచ్చి నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సోమవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన మంటలు రాత్రి సుమారు 11 గంటల వరకు కొనసాగాయి. ఈ ఘటనలో రెండు మిల్లులకు ఘోర ప్రమాదం తప్పింది. మిల్లుల్లోకి మంటలు ప్రవేశించి ఉంటే అందులోని ధాన్యం, మిషనరీ అంతా తగలబడే ది. రోడ్డుకు అటుగా వెళ్తున్నవారు, మిల్లు సిబ్బం ది, యజమానులకు సమాచారం అందించగా వారు ఫైర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పరకాల సీఐ జి.మధు, ఏసీపీ వైవీఎస్ సుధీంద్ర, ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్, రవికిరణ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మం టలు వ్యాపిస్తున్న ప్రదేశానికి ఎవరూ కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. సిబ్బంది బకెట్లతో ఓవైపు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పరకాల ఫైర్ ఇంజిన్ చేరుకుని శ్రీరామ రైస్‌మిల్లుకు మంటలు వ్యాపించకుండా ఆర్పే ప్రయ త్నం చేసినప్పటికీ ఎంతకూ అదుపులోకి రాలేదు. వెంటనే ఏసీపీ సుధీంద్ర, సీఐ మధు ములుగు, హుజురాబాద్, కేటీపీపీ, హన్మకొండ ఫైర్ స్టేషన్‌లకు సమాచారం అందించి, ఫైర్ ఇంజిన్లను రప్పించాలని కోరారు. మూడు ఫైర్ ఇంజిన్లు సుమారు గంటన్నరపాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. ఆర్డీవో కిషన్‌కు ఏసీపీ సుధీంద్ర సమాచారం అందించగా హుటాహుటిన ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లలో నీరు అయిపోతుండడంతో పురపాలక సంఘం ట్యాంకుల ద్వారా నీటిని తెప్పించారు. అంతేకాకుండా పరిస్థితిని జిల్లా కలెక్టర్ హరితకు సమాచారాన్ని చేరవేశారు. రెండున్నరగంటలు మంటలు వ్యాపించడంతో ఆ చుట్టూగల సుమారు 500 తాటి, ఈత చెట్లు కాలిపోయాయి. అనంతరం జిల్లా ఫైర్ ఆఫీసర్ భగవాన్‌రెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

రైస్ మిల్లులకు తప్పిన ప్రమాదం
పట్టణ శివారుల్లోని మహేశ్వర, శ్రీరామ ఇండస్ట్రీస్(రైస్‌మిల్లులు)కు పెను ప్రమాదం తప్పిం ది. మంటలు కాస్త మిల్లుల గోడల చుట్టూనే తిరిగా యి. ఫైర్ సిబ్బంది ఎంత శ్రమించినప్పటికీ చెట్ల మోగుల్లోని నిప్పురవ్వలు ఆరకుండా పదేపదే మంటలు ఎగిసిపడ్డాయి. ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో రైస్‌మిల్లుల యజమానులు, చూసేందుకు వచ్చిన ప్రజలు వాటిని మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. రెండు మిల్లుల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నచోటే భీకర మంటలు చెలరేగడంతో భయపడ్డారు. కానీ ఎలాంటి ఆస్తి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పరకాల, కేటీపీపీ ఫైర్ సిబ్బంది సేవలు
పరకాల ఫైర్ సిబ్బంది ఇంజిన్‌లో నీరు అయిపోయినా కొద్దీ నీటిని తీసుకొస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంతలోనే కేటీపీపీ ఫైర్ ఇంజి న్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను లక్ష్యం గా చేసుకుని ఇంజన్ టాప్ నుంచి మంటలను ఆర్పింది. దీంతో పరిస్థితి అదుపులోకి రావడంతో అక్కడున్నవారంతా ఫైర్ సిబ్బందిని అభినందించారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ ఇంజిన్లతో మిల్లుల పైభాగం, పరిసరాలను తడిపారు. సుమారు నాలుగు గంటలపాటు పోలీసులు ప్రమాదస్థలంలోనే ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...