రైతుబంధు దేశానికే ఆదర్శం


Tue,March 26, 2019 01:47 AM

- ప్రతీ ఎకరాకు సాగునీరందించడమే లక్ష్యం
- 16ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో కేసీఆర్ చెప్పిందే చెల్లుతది
- ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం
- పసునూరికి లక్షమెజార్టీ ఇస్తాం
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

సంగెం, మార్చి 25 : రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని నల్లబెల్లి, నార్లవాయి, మొండ్రాయి, పల్లార్‌గూడ, వంజరపల్లి, కృష్ణానగర్, చింతలపల్లి గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చల్లాకి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి డప్పుచప్పుల్లతో గ్రామాలకు ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాల్లోని మహిళలు, యువతులు, యువకులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో టీఆర్‌ఎస్ జెండాలతో కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో గ్రామాలు మార్మోగాయి. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే దేశవ్యాప్తంగా ఉన్న ప్ర భుత్వాలు తమ తమ రాష్ర్టాల్లో ప్రవేశపెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారన్నారు.రాష్ర్టానికి నిధుల కొరత ఉండదని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పార్టీలకతీతంగా గ్రామాలన్నీ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు ఓటేసేందుకు ఏకగ్రీవ తీర్మానాలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జూన్‌లోగా పూర్తి అవుతుందని ప్రతీ ఎకరాకు సాగునీరు అందివ్వడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా చెరువులన్నీ నింపుతామని తద్వారా రైతులకు పంటలు పండించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేర్చుతామని అన్నారు.

ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు. మే నెల నుంచి పెంచిన ఆసరా ఫించన్లు అందుతాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరకాల నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ ఇవ్వటమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల పరకాల నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పులి సారంగపాణిగౌడ్, జెడ్పీటీసీ గుగులోతు వీరమ్మ, మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, మండల రైతు సమన్వయసమితి అధ్యక్షుడు కందకట్ల నరహరి, ఏఎంసీ డైరెక్టర్ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు మామిడాల సుదర్శన్, కోడూరి రజిత, ఇజ్జగిరి స్వప్న, మే రుగు మల్లేషం, కక్కెర్ల కుమారస్వామి, కడారి మోహన్, బుచ్చానాయక్, గుగులోతు రమాదేవి, ఎంపీటీసీలు మామిడాల లక్ష్మి, కడ్దూరి సంపత్, బాలు, టీఆర్‌ఎస్ నాయకులు కొట్టం రాజు, వీరభద్రయ్య, వీరేశం, కోటి, రమేష్, పెండ్లి కుమారస్వామి, బు చ్చిబాబు, ప్రతాప్, గోపిసింగ్, గండ్రకోటి రవి, సాగర్‌రెడ్డి, కిషోర్‌యాదవ్, సదానందం, ఉండీల రాజు, శంకరయ్యతో పాటు ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...