టీఆర్‌ఎస్ వైపే ప్రజలు


Tue,March 26, 2019 01:46 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలని పంచాయ తీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పి లుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నర్సంపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మహబూ బాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోత్ కవితను పోటీలోకి దింపామని పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పే దల సంక్షేమం కోసం తీవ్రంగా పనిచేస్తున్నదని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసమే వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి అమ లు చేస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలోని 16 స్థానాల్లో గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ వై పే ప్రజలు సుముఖంగా ఉన్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్ర వేశపెడుతున్న పథకాలపై ప్రజలు ఆకర్శితులయ్యారని వివరించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా పథకాలను అమలు చేసిన ఘనత ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకే దక్కిందని అన్నారు. రైతుబంధు పథకంలో రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నామని తె లిపారు. రైతు బీమాలో రూ.5 లక్ష ల వరకు బీమాను ప్రతీ రైతుకు అందిస్తున్నారని గుర్తు చేశారు. రై తులకు 24 గంటల పాటు ఉచితంగా కరెంటును అందిస్తున్న ఘ నత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రైతులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసరా, వితంతు, వికలాంగ, బీడి కార్మికులు, ఒంటరి మహిళకు పింఛన్లు అం దించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందుని ఆయన వివరించారు. టీఆర్‌ఎస్‌ను తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వానికి కూడా తగిన మెజార్టీ లభించే పరిస్థితి లేదని, టీఆర్‌ఎస్ ఎక్కువ గెలిస్తే రాష్ర్టానికి మేలు కలుగుతుందని అ న్నారు. తెలంగాణ ప్రాంతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అ భివృద్ధి చెందుతుందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతీ కార్యకర్త చురుగ్గా వ్యవహరించాలని తెలిపారు. గత ఎన్నికల్లో మాదిరిగానే టీఆర్‌ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేసి కవి తను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన వివరించారు. ప్రచారంలో భాగంగా ఈ నెల 30న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీన మహబూబాబాద్‌కు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ రోడ్డు షోకు నర్సంపేట నియోజవకర్గం నుంచి 25 వేల మందిని తరలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, చెన్నారావుపేట జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, బుర్రి తిరుపతి, కోరె రమేశ్, భూక్య కిషన్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...