క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలి


Tue,March 26, 2019 01:46 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : క్షయ వ్యాధిని నివారించాలని రూరల్ జిల్లా డీఎంహెచ్‌వో మధుసూదన్ కోరారు. సోమవారం నర్సంపేట ఐఎంఏ హాలులో ప్రపంచక్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన ఆవరణ నుంచి వరంగల్ రోడ్డు కూడలి వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి పూర్తిగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. వ్యాధి నివారణకు తప్పనిసరిగా మందులు వాడాలని కోరారు. డాట్స్ చికిత్స వల్ల లాభాలు కలుగుతాయని తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స పూర్తి అయ్యేంత వరకు ప్రతి నెల రూ.500 పోషణ భత్యం లభిస్తుందని అన్నారు. క్షయవ్యాధి పూర్తిగా నయం అయ్యే వరకు మందులు వాడాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ మధ్యలో నిలిపివేయవద్దని కోరారు. ఉద్యోగులు క్షయ వ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేయాలని కోరారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న జబ్బులలో క్షయ వ్యాధి మొదటి వరుసలో ఉందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారంగా ప్రపంచంలో ప్రతీ రోజూ 4500 మందిని క్షయ వ్యాధి బలితీసుకుంటున్నదని పేర్కొన్నారు. క్షయ వ్యాధి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఇది ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిలా వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారు ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటరమణ, డాక్టర్ శిరీష, జిల్లా మాస్‌మీడియా అఫీసర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

ఖానాపురంలో..
ఖానాపురం : టీబీ వ్యాధిని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని మండల వైధ్యాధికారి విపిన్‌కుమార్ అన్నారు. సోమవారం ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో పీహెచ్‌సీ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ ,అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వైధ్యాధికారి మాట్లాడుతూ టీబీ వ్యాధి సోకిన వారు భయపడకూడదని అన్నారు. పూర్తిగా మందులతో తగ్గిపోతుందని అన్నారు.సరైన పౌష్టికాహరం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులను ఆడితే వందశాతం తగ్గిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దుగ్గొండిలో..
దుగ్గొండి: క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని దుగ్గొండి ప్రాథమిక వైద్యాధికారి కొంరయ్య అన్నారు. సోమవారం మండలంలోని కేశవాపురం, దుగ్గొండి గ్రామాల్లో క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుగ్గొండి, కేశవాపురం పీహెచ్‌సీల వైద్యాధికారులు, కొంరయ్య, భావన ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ప్లకార్డులతో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు . వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది, బాస్కర్, చక్రపాణి, వెంకటేశ్వర్లు, సురేశ్, చాణక్య, రాజకుమారి, సృజనా,, రమ, లలితాలతో పాటు పలువురు సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...