భక్తి శ్రద్ధలతో ముగిసిన అన్నారం ఉర్సు ఉత్సవాలు


Tue,March 26, 2019 01:46 AM

- మూడోరోజు ఖురాన్ గ్రంధ పఠనంతో ముగింపు
- పులకరించిన భక్తులు, యాత్రికులు

పర్వతగిరి : ప్రసిద్ధ అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగి సోమవా రం ముగిశాయి. మూడో రోజు ఉర్సు ఉత్సవాల లో భాగంగా ముస్లిం మత పెద్దలు, ముజావర్లు, సలాం పాటలను ఆలపించారు. అత్యంత వైభవంగా ఖత్మున్ ఖురాన్ గ్రంధ పఠనం సాగింది. ఫాతీయా, దువా కార్యక్రమాలు ముస్లిం మత పె ద్దల ప్రత్యేక ప్రార్థనలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉర్సు ఉత్సవాల్లో ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు వ చ్చి దర్శించుకున్నారు. దర్గాను అన్ని విధాల ము స్తాబు చేసి, విద్యుత్ కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. అన్నారం దర్గా ఆవరణతో పాటు చుట్టు పక్కల పరిసర ప్రాంతాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించగా పండుగ వాతావరణం నెలకొన్నది. ఉ ర్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ఖవ్వాలి కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో రైతుసమితి అధ్యక్షుడు మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ మునుకుంట్ల యశోదబాబు, ఉపసర్పంచ్ మదన్‌మోహన్, మాజీ సర్పంచ్ జడ ల పద్మకృష్ణ, కో ఆప్షన్ మెంబర్ ఎస్‌కే షబ్బీర్ ఆ లీ, ఎంపీటీసీ ఈ రాధిక, ఈరగాని సాంబయ్య, సారంగపాణి, మోటపోతుల సురేశ్, దర్గయ్య, యాఖూబ్, ముస్లిం మైనార్టీ నాయకులు, ముజావర్లు మహబూబ్ అలీ, ఎస్‌కే బాస్మియా, గౌస్ పాషా, బాబు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...