టీఆర్‌ఎస్‌లో 300 మంది చేరిక


Tue,March 26, 2019 01:45 AM

సంగెం, మార్చి 25 : మండలంలోని తిమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. ఆ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌లు వేల్పుల కుమారస్వామి, మాదినేని రాంరెడ్డి ఆధ్వర్యంలో 300 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ పార్టికీ రాజీనామా చేసిన టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం మండలంలోని కాపులకనపర్తి గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్ట్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సర్పంచ్, సంగెం పీఏసీఎస్ మాజీ చైర్మెన్ వేల్పుల కుమారస్వామి ఎమ్మెల్యే ధర్మారెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటానన్నారు. అందరికి సముచిత స్థ్ధానం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, సాగర్‌రెడ్డి ,న రహరి, గన్ను సంపత్, ఉండీల రాజు, ఎర్రన్న, కిషోర్‌యాదవ్, చత్రునాయక్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...