వార్ వన్‌సైడే..


Mon,March 25, 2019 02:35 AM

- ప్రతిపక్షాల పనైపోయింది
- అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కడుతున్నారు
- యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు
- లక్ష మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- దేశప్రజల దృష్టిని ఆకర్షించబోతున్నాం
- మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
- మరోసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
- ఎంపీ పసునూరి దయాకర్
- ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం సక్సెస్

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తున్నది. ఈ ఎన్నికల్లో 16లోక్‌సభ స్థా నాలు టీఆర్‌ఎస్ గెలువబోతున్నది. కానీ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీకి మించిన మెజార్టీని అందించాలి. ప్రజలకు కేసీఆర్‌పై, ప్రభుత్వంపై ఎంతో నమ్మ కం ఉంది. ప్రజల అభీష్టానికి, ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపుని చ్చారు. ఈ ఎన్నికల్లో వా ర్ వన్‌సైడేనని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని మంత్రి చెప్పా రు. పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి అ ధ్యక్షతన ఒగ్లాపూర్ శివారుల్లో ఆదివా రం రాత్రి జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి నా లుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టా న్ని శరవేగంగా ముందుకు తీసుకవెళ్తున్న ఘన త సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. గోదావరి జలాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు కళకళలాడనున్నాయన్నారు. 360 రోజులు మత్తళ్లు దూకే పరిస్థితి మరో ఆరు నెలల్లో రాబోతున్నదని స్ప ష్టం చేశారు. ఊరూరికి గోదావరి జలాలు అందించేందుకు తాగునీటికి శుద్ధజలాలను సరఫరా చేసేందుకు కృషి చేస్తున్న మహానేత కేసీఆర్ అని, అలాంటి మహాత్ముడికి 16లోక్‌సభ స్థానాలను గెలిపించి బ హుమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం లో చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల వలసలు వెళ్లినవారంతా గ్రామాలకు వెనక్కి వస్తున్నారని స్పష్టం చేశా రు. రైతులకు, రైతు కూ లీలకు ఎన్నో వసతులు కల్పించార ని చెప్పారు. నేడు వ్య వసాయం పండగలా మారి భూ ములకు డి మాండ్ పె రిగిందని చెప్పారు. ప్రతీ కార్యకర్త ప్రభుత్వం చేపట్టి న కార్యక్రమాలు, అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను తన, మన, ఇతర పా ర్టీలనే భేదంలేకుండా ప్రతీ ఒక్కరి ఇంటికివెళ్లి వివరించాలని సూచించా రు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీ మా, ప్రసూతి పథకం, కేసీఆర్ కిట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలను వివరించాలని చెప్పారు. పార్టీ ఏదైనా ఓటు అడగాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. ప్రతీ కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. మొదటినుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నవారితోపాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా తన సంపూర్ణ సహకా రం ఉంటుందన్నారు. బాధ్యతలు పెరిగాయని, ప్రజల్లో అణిగిమనిగి ఉంటూ తలవంచుకుని ప్ర జలకోసం పనిచేయాలన్నారు. తప్పులు చేయకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రెండు ఎంపీ స్థానాలతో తెలంగా ణ తెచ్చిన మగధీరుడు కేసీఆర్ అని, 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే దేశ రా జకీయాలను శాసించి తెలంగాణను మరింత వేగవంతం గా అభివృద్ధి చేయగల మహానేత అని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇంటింటికి నీరిచ్చిన కేసీఆర్‌ను ఎవరూ మరువబోరన్నారు. 35ఏళ్ల తన రా జకీయ జీవితంలో అ ద్భుతమైన పోర్ట్‌ఫోలి యో ఇచ్చి ప్రజల కోసం పనిచేయమని చెప్పారన్నారు. రా నున్న రోజుల్లో జిల్లాలోని పరకాల కేంద్రంగా యువతకు ఉద్యోగ, ఉపాధిరంగాల్లో శిక్షణ ఇచ్చి ఉ ద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో మహానేత కేసీఆర్ ఆదేశాల మేరకు లక్షకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని దయాకర్‌రావు కోరారు.

కొండాను పిండిచేసిన ఘనత పరకాలదే
రౌడీరాజకీయాలు, హత్యారాజకీయాలు, గూండాగిరి చలాయించే వారి కొండాలను పిండిచేసిన ఘనత పరకాల కార్యకర్తలదేనని మంత్రి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పరకాల కార్యకర్తలను మొన్నటికి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల్లోని రౌడీలు బెదిరించినా ఎదురొడ్డి పనిచేసి టీఆర్‌ఎస్‌కు అత్యధిక మెజార్టీని అందించారని అన్నారు. విర్రవీగిన కొండాలను పిండి చేసి సవాల్ విసిరిన కార్యకర్తలకు తలవంచి నమస్కరిస్తున్నానంటూ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య దయాకర్‌రావు అభివాదం చేశారు. ప్రగల్భాలు పలికిన ప్రతిపక్ష పార్టీలవారిని ఓటుతో ఉరికి.. ఉరికి.. ఉరికించారని, అంత శక్తిమంతమైన టీఆర్‌ఎస్ శ్రేణులను అభినందిస్తున్నట్లు దయాకర్‌రావు ప్రకటించారు. ఇక కొండను పిండి చేసి ఆ రౌడీ రాజకీయాల వాసనను కూడా లేకుండా చేసిన నియోజకవర్గంలోని పార్టీశ్రేణులు మరో అడుగు ముందుకేసి దాని ఆనవాళ్లు కూడా లేకుండా చేయడంలో భాగంగా ఎంపీ పసునూటి దయాకర్‌కు అత్యధిక మెజార్టీనివ్వాలన్నారు. గ్రామాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి ఇంటికి వెళ్లి ఓట్లు అడగాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

మంత్రి ఎర్రబెల్లికి ఘన సన్మానం
దామెర : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం దామెర మండలం ఒగ్లాపూర్ డిస్నిల్యాండ్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎంపీ ఎన్నిక సన్నాహాక సమావేశానికి రాగా టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఏనుమాముల మార్కెట్ చైర్మన్ కొంపల్లి ధర్మరాజులు, టీఆర్‌ఎస్ దామెర, గీసుకొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు జకీర్ అలీ, పోలీస్ ధర్మారావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావవు, కానుగంటి సంపత్, నాగిరెడ్డి, ఎంపీపీ మల్లికార్జున్, జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, వైస్‌ఎంపీపీ జనగం రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లు ఎన్కతాళ్ల రవీందర్, బిల్లా రమణారెడ్డి, కేశవరెడ్డి, దామెరుప్పుల శంకర్ తదితరులు మంత్రిని సన్మానించిన వారిలో ఉన్నారు.

మరింత అభివృద్ధి చేస్తా : ఎంపీ పసునూరి ..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి టికెట్ ఇవ్వడంపట్ల ఆనందంగా ఉందని ఎంపీ పసునూటి దయాకర్ అన్నారు. గడిచిన పదవీకాలంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని చె ప్పారు. తిరుగులేని నేతలతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకులు సఖ్యతతో పనిచేసి గత మెజార్టీని బద్దలుకొట్టి అత్యధిక మెజార్టీనిచ్చి ఆశీర్వదించాలన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 96కిలోమీటర్ల జాతీయ రహదారి అభివృద్ధి, మూడవ బల్లార్ష రైల్వేలైన్, వ్యాగన్ ఓవరాలింగ్ సెంటర్ సాధించినట్లు గుర్తు చేశారు. టెక్స్‌టైల్ పార్కు మంజూరు, రెండు రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్ల మం జూరు, పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటుకు కృషి చేశానని చెప్పారు. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కూ డా ప్రయత్నించానని దయాకర్ పేర్కొన్నారు. రైల్వే డివిజన్ కూడా సాధిస్తామని చెప్పారు. 16 పార్లమెంట్ స్థానాల్లో మనం గెలుపొందితే మరిన్ని అభివృద్ధి పనులు చేయగలమన్నారు. రానున్న రోజులన్నీ ప్రాంతీయ పార్టీలవేనని కేసీఆర్ ఈ దేశానికి దిక్సూచిగా ఉంటారని అన్నారు.

ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి : ఎమ్మెల్యే చల్లా ..
లోక్‌సభ ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎంపీ అభ్యర్థి పసునూటి దయాకర్‌కు లక్ష మెజార్టీని అందించేలా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ధర్మారెడ్డి చెప్పారు. దేశ రాజకీయాలలో కేసీఆర్ చక్రం తిప్పాలంటే ఈ 16 స్థానాలు అత్యధిక మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పనిచేయాలని ధర్మారెడ్డి కోరారు.

లక్షే లక్ష్యంగా పనిచేయాలి : కడియం..
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభివృద్ధికి ఒక్క పరకాల నియోజకవర్గం నుంచి ఒక లక్ష మెజార్టీనిచ్చి ఇదే లక్షే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పోరాటాల పురిటిగడ్డను పరకాల నియోజకవర్గాని కి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదన్నారు. రాష్ట్రంలో ఈసారి పరకాల నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీనిచ్చి కేసీఆర్ దృష్టిని ఆకర్షించాలన్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నామని, ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు మంచి పేరు ప్రఖ్యాత లు, విశ్వాసం ప్రజల్లో మెండుగా ఉన్నాయని చెప్పారు. సుశిక్షకులైన కార్యకర్తలు, మంచి నాయకత్వంతో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించబోతున్నదని స్పష్టం చేశారు. స్థానిక నాయకత్వం ప్రతీ ఓటరును ప్రత్యక్షంగా కలవాలని, ఇంటింటికి వెళ్లి ఓటు అడగాలని అన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...