లక్ష మెజార్టీ ఖాయం


Mon,March 25, 2019 02:34 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఆరు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో గతంలో ఎన్నడూలేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా ప్రతీ గ్రామానికి రహదారిని నిర్మించడంతో పాటు అర్హులైన పేదలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దీనివల్ల నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పారు. అలాగే, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతృప్తింగా ఉన్నందున ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసేలా కృషి చేయాలని కోరారు.

26న నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం
హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో ఈనెల 26న నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో లలితాయాదవ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...