ఎంపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Mon,March 25, 2019 02:34 AM

శాయంపేట, మార్చి 24 : పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివ అన్నారు. శాయంపేట మండలంలోని మాందారిపేట దళిత వాడలో దయాకర్ గెలుపు కోరుతూ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. శివ మాట్లాడుతూ మరోసారి టీఆర్‌ఎస్ ఎంపీగా దయాకర్ గెలుపు నల్లేరుపై నడకేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. అతి త్వరలోనే వృద్ధులు, వితంతువులు, ఇతరులకు నెలవారి పింఛన్లు పెరుగుతాయన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోను అభివృద్ధి చేసిన ఘనత మాజీ స్పీకర్ మధుసూదనాచారికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి అధిక మెజారిటీ ఇచ్చి మధుసూదనాచారికి కానుకగా ఇవ్వాలన్నారు. దీని వల్ల నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఆయనకు దక్కుతుందన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోను అమలు చేయని పథకాలు కేసీఆర్ అమలు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అందుకే దేశంలోనే కేసీఆర్ నంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. కేంద్రంలో 16 ఎంపీలను టీఆర్‌ఎస్ తరఫున గెలిపిస్తే రాష్ర్టానికి కావాల్సిన నిధులు తెప్పిస్తారన్నారు. దేశానికి కేసీఆర్ సేవలు ఎంతో అవసరమని అన్నారు. అందుకని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి టీఆర్‌ఎస్ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జల్గూరి రవీందర్, కొమ్ముల విష్ణు, వంశీ, మల్లికార్జున్ పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...