మానుకోటలో గులాబీ జెండా ఎగురవేస్తాం


Sun,March 24, 2019 02:06 AM

చెన్నారావుపేట, మార్చి23 : పార్లమెంట్ ఎన్నికల్లో మానుకోటలో గులాబీ జెండాను ఎగుర వేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితను సీఎం కేసీఆర్ ప్రకటించారని, త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని సూచించారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ అందించడం ఖాయమైందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో నాయకత్వం లేకుండా పోయిందని, ఓటర్లు కూడా కాంగ్రెస్ నాయకుల వైఖరిపై విశ్వాసం కోల్పోయారని అన్నారు. అంతేకాక రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు వస్తున్నారని, చివరకు ఆ పార్టీలో ఇద్దరే ఇద్దరు మిగులే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత భారీ మెజార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అంతేకాక టీఆర్‌ఎస్ పార్టీలో చేరికలపై దృష్టి సారించి పార్టీని మరింత ప్రతిష్ట పరచాలని ఆయన కోరారు. గత 30 సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ప్రతీ గ్రామం, తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బీరం సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, మండల అధికార ప్రతినిధి బాల్నె వెంకన్న, జాగృతి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు కొండవీటి ప్రదీప్‌కుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, తొగరు చెన్నారెడ్డి, బోడ బద్ధూనాయక్, మార్కెట్ డైరెక్టర్ మహ్మద్ రఫీ, భూక్య లింగం, మురహరి రవి, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, బోడ ఆనంద్, బానోతు లాల్‌సింగ్, శ్రీనివాస్, నాయకులు భూక్య రవీందర్‌నాయక్, బోడ వెంకన్న, పిండి భిక్షపతి, చింతకింది వంశీ, పూదోట బౌటర్, కుసుమ నరేందర్, ఎడ్ల మల్లయ్య, కాటి రాంబాబు, కడారి సాయిలు, బుర్రి యాదగిరి, గుర్రం రవి, బుర్ర సుదర్శన్, బానోతు గణేశ్, అండ్ర బాలజోజి, గుగులోతు స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...