భారీ మెజార్టీయే లక్ష్యం


Sun,March 24, 2019 02:06 AM

నెక్కొండ : పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నర్సంపేట డివిజన్ భారీ మెజార్టీని సాధించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పనిచేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్థానిక వాసవీ కల్యాణమండపంలో ఎంపీపీ గటిక అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడారు. నియోజకవర్గం నుంచి 50వేలకు పైగా మెజార్టీని అందించి సీఎంకు కేసీఆర్‌కు బహుమతిగా అందించాలని సూచించారు. మండలం నుంచి 8వేల మెజార్టీని తప్పకుండా అందించాల్సిన అవసరముందన్నారు. ఎక్కడికక్కడ లక్ష్యాన్ని నిర్ణయించుకొని కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో సైనికుల్లా పనిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జాడ లేకుండా పోయిందని, ఇప్పుడు ఆ పార్టీ అతలాకుతలమైందన్నారు.

ప్రస్తుతం జరగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు ఒకరితో ఒకరు పోటీపడి భారీ మెజార్టీని సాధించడమే ముందున్నదన్నారు. మహబూబాబాద్ ప్రాంతం ఆది నుంచి అభివృద్ధిలో వెనకబడిందని, ఈ సారి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు అంతా టీఆర్‌ఎస్‌పార్టీకే చెందిన వారేనని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలువాలంటే మహబూబాబాద్‌నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిని మాలోతు కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. దేశంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ ప్రజలను ఓటేయాల్సిందిగా కోరాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాయకులంతా పనిచేయాలన్నారు. అలాగే మహబూబాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంపీపీ అజయ్‌కుమార్ మంచి ఫలితాలను అందించారని, ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ నాయకులను సమన్వయ పరుస్తూ భారీ మెజార్టీని అందించేందుకు కృషిచేయాలన్నారు. ఎంపీపీ అజయ్‌కుమార్ మాట్లాడుతూ మండలం నుంచి భారీ మెజార్టీని అందించేందుకు తగిన ప్రణాళికతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుంటుక సోమయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు చల్లా చెన్నకేశవరెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, రాము, ఆవుల చంద్రయ్య, హరిసింగ్ పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...