టీడీపీ దుక్నం బంద్


Sun,March 24, 2019 02:06 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పరకాల నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ దుక్నం బంద్ అయింది. అక్కడక్కడ ఉన్న మండల, గ్రామస్థాయి నాయకులు, బాధ్యులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులతోపాటు కొత్తగా చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఉదయం పరకాల, దామెర, గీసుకొండ, సంగెం తదితర మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గంలోని దాదాపు 80గ్రామాల్లో ఉన్న క్రియాశీల ముఖ్య కార్యకర్తలంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి హన్మకొండలోని తన స్వగృహంలో వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజల్లో మరింత ధైర్యం, సంక్షేమంపై నమ్మకం, అభివృద్ధిపై ఆశలు పెరిగాయన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ పౌరుడికి లబ్ధిచేకూరేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

ఈ క్రమంలోనే చుక్కాని లేని నావలా ఉన్న టీడీపీలోని కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో ప్రవాహంలా వచ్చి చేరుతున్నారన్నారు. ఈ మేరకు పరకాల మండల పార్టీ నాయకులతోపాటు పట్టణ అధ్యక్షుడు కొలుగూరి రాజేశ్వర్‌రావు, దామెర మండల టీడీపీ అధ్యక్షుడు బుర్రి చేరాలు, గీసుకొండ మండల పార్టీ అధ్యక్షుడు పత్తిపాక రవీందర్, సంగెం మండల అధ్యక్షుడు కోడూరి శ్రీనివాసరావు, టీడీపీ ముఖ్య నాయకులు తోట రవీందర్, రజనీకాంత్, కైలాసం, అనిల్, సంతోశ్, రవి, బిక్షపతి, సుధాకర్, రవి, చెరుకుపెల్లి సాంబరెడ్డి, స్వామి, సదానందం తదితర 300 మంది ముఖ్య కార్యకర్తలు, ఆయా గ్రామాల్లోని సుమారు 1200 మంది టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరకీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, బీముడి నాగిరెడ్డి, జాకీర్‌అలీ, కానుగంటి సంపత్, పోలీస్ ధర్మారావు, కేశవరెడ్డి, శంకర్, జైపాల్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గోపు మల్లికార్జున్, లేతాకుల సంజీవరెడ్డి, వీరగోని రాజ్‌కుమార్, గుగులోతు వీరమ్మ, తిరుపతిరెడ్డి, ప్రకాశ్‌రావు, రేగూరి విజయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గీసుగొండ : టీడీపీ మండల అధ్యక్షుడు పత్తిపాక రవీందర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరగోని కవిత, రైతుసమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మాధవరెడ్డి పాల్గొన్నారు. అలాగే, ధర్మారం గ్రామానికి చెందిన గోపాల రమ-శ్రీనివాస్ దంపతుల కుమార్తె దీక్షిత వివాహం పీడీఆర్ గార్డెన్‌లో జరగగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, రాష్ట్ర నాయకులు బస్వరాజు సారయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపల్లిధర్మారాజు తదితరులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. నాయకులు రాజు, సుంకరిశివ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...