తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ


Sun,March 24, 2019 02:05 AM

రాయపర్తి,మార్చి 23 : మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అర్‌డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని తిర్మాలయపల్లి శివారు టీకే తండా మీదుగా వెళుతున్న ఆయన మార్గమధ్యలో తండా వద్ద ఉన్న బోరింగ్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న మహిళలను చూసి వాహనం దిగి, వారితో ముచ్చటించారు. తండాలో గ్రామపంచాయతీ సిబ్బంది తాగునీరు సరఫరా చేస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మం త్రి మాట్లాడుతూ మారుమూల పల్లెలు, గిరిజన తండాలు, ఆవాసప్రాంతాల్లోని ప్రజల తాగునీటి తిప్పలు, ఆడబిడ్డలకు నీటిగోస తీర్చేందుకే ఠూపభు త్వం మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు ముగింపు దశకు వచ్చాయన్నారు. గ్రామాల్లోని వాటర్ ట్యాంకులపై సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు రాయిస్తున్నట్లు తెలిపారు. నీటి సమస్య ఎదురైనప్పుడు అధికారులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. ప్రజాసేవల విషయంలో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అనిమిరెడ్డి, నాయకులు ప్రసాద్, కుమారస్వామి, మారయ్య ఉన్నారు

వధూవరులకు ఆశీర్వాదం
మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై నూతన వధూవరులను ఆశ్వీదించారు. కేశవపురం ఎంపీటీసీ గాజుల రవీందర్‌గౌడ్ కుమారుడు ప్రవీణ్‌గౌడ్-దుర్గాభవాని వివాహ విందుతో పాటు తిర్మాలయపల్లి గ్రామానికి చెందిన నర్సింహరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి-భవాని వివాహ వేడుకలకు మంత్రి హాజరయ్యారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...