పోలింగ్ @ 88.70%


Sat,March 23, 2019 02:02 AM

- జిల్లాలో 88.70 శాతం నమోదు
- ఓటు హక్కు వినియోగించుకున్న 549 మంది పురుషులు, 169 మంది మహిళలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శువ్రారం ప్రశాంతంగా ఎన్నికల్లో 88.70 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల నిర్వహణ సిబ్బంది, అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రంకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికలను కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి, డీఆర్వో హరిసింగ్, ఆర్డీవోలు కిషన్, రవి పర్యవేక్షించారు. 805 మంది ఓటర్లకు 714 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలోని 16 మండల కేంద్రాల్లో 16పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 34బ్యాలెట్ బాక్సులను ఉపయోగించారు. 56 మంది ఏపీవోలు, ఓపీవోలు, పీవోలు, తొమ్మిది మంది నోడల్ అధికారులు, ఏడుగురు సెక్టోరియల్ అధికారులు బాధ్యతలు నిర్వర్తించారు. 14 ఎంసీసీ టీంలు, 14 ఫ్లయింగ్‌స్కాడ్స్, 30 మంది వీడియోగ్రాఫర్లు, 18 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వీరంతా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు విధులు నిర్వర్తించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత కలెక్టరేట్‌కు బాక్సులను తరలించారు.

అత్యధికం నడికూడ.. అత్యల్పం వర్ధన్నపేట
జిల్లాలోని నడికూడ మండలంలో 95.04 శాతం నమోదు కాగా వర్ధన్నపేటలో 63.89శాతం అత్యల్పంగా నమోదైంది. జిల్లాలో 805 మంది ఓటర్లలో.. 605 మంది పురుష ఓటర్లు, 200 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మొత్తం 714 మంది ఉన్నారు. పురుషులు 545 మంది, మహిళలు 169 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓట్లలో పురుషులు 90.08 శాతం మంది, మహిళలు 84.50 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కలెక్టరేట్‌కు చేరుకున్న ఎన్నికల సామగ్రి
రూరల్ కలెక్టరేట్ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు రూరల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామగ్రిని కలెక్టరేట్‌కు తరలించి అధికారులకు అందజేశారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఎన్నికల బ్యాలెట్ బాక్సులను శుక్రవారం రాత్రి ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో నల్లగొండలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద గల రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...