10 మంది అభ్యర్థులు.. 11 సెట్లు..


Sat,March 23, 2019 02:01 AM

అర్బన్ కలెక్టరేట్, మార్చి 22: వరంగల్ లోక్‌సభ్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం 10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నామినేషన్లకు ఇక సోమవారం ఒక్క రోజు మాత్రమే గడువు మిగిలి ఉందని చె ప్పారు. శనివారం (23వ తేదీ), ఆదివారం (24వ తేదీ) సెలవు రోజులు కావడంతో నామినేషన్లు స్వీకరించబోమని తెలిపారు. సుబేదారిలోని పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రిసిప్షన్ సెంటర్ మాత్రం పనిచేస్తుందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు, పార్టీలకు నామినేషన్ ప్రొఫార్మాలను ఇస్తామని వెల్లడించారు. నామినేషన్ పత్రం తో జతచేయాల్సిన సర్టిఫికెట్లు, తదితర అంశాలపై రిసిప్షన్ సెం టర్‌లో వివరిస్తారని చెప్పారు. కాగా, శుక్రవారం నామినేషన్ వేసినవారిలో టీడీపీ నుంచి హన్మకొండ సమ్మయ్య ఒకసెట్, కాంగ్రెస్ నుంచి దొమ్మాటి సాంబయ్య రెండు సెట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు చిలువేరు ప్రతాప్ ఒక సెట్, అయిత ప్రవీణ్‌కుమార్ ఒక సెట్, జేరుపోతుల ఉపేందర్ ఒక సెట్, బరిగల శివ ఒక సెట్, బీజేపీ నుంచి బొక్కా ప్రభాకర్ ఒక సెట్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి గాదెపాక అనిల్‌కుమార్ ఒక సెట్, టీఆర్‌ఎస్ నుంచి పసునూరి దయాకర్ తరుపున ఆరెల్లి అంజన్‌కుమార్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

పసునూరి తరుపున నామినేషన్
ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి ద యాకర్ తరుపున ఆరెల్లి అంజన్‌రావు శుక్రవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా, వరంగల్‌లోని శ్రీభద్రకాళీ అమ్మవారిని ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ దర్శించుకుని, పూజలు చేశారు. దయాకర్‌ను ఎమ్మెల్యే దా స్యం వినయభాస్కర్, రాచర్ల రాము, ఎండీ షఫీ, గట్టు చందు, గట్టు శివ తదితరులు అభినందించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...