జాతరలకు పోటెత్తిన భక్త జనం


Sat,March 23, 2019 02:01 AM

చెన్నారావుపేట,మార్చి 22 : మండలంలోని కోనాపురం గ్రామంలోని ఊరగుట్టపై ఉన్న లక్ష్మీనర్సింహాస్వామికి భక్తులు ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు.శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకుడు శివకృష్ణ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలు అలాగే చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లు, ప్రభ బండ్ల పై డప్పు చప్పుళ్ల నడుమ నృత్యాలు చేసుకుంటూ జాతరకు తరలి వచ్చి గుట్టపై ఉన్న స్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చాలంటూ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామంలోని గుట్టపై సందడి వాతావరణం కనిపించింది. హోలీ పండుగను పురస్కరించుకుని ప్రారంభమైన జాతర శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాతసారంగం, ఎంపీటీసీ ఆవుల రాములు, ఉపసర్పంచ్ మండల నర్సింహరాములు, కుల పెద్దలు పాల్గొన్నారు.

మొక్కులు చెల్లించుకున్న భక్తులు
మండలంలోని 16 చింతల్‌తండాలో ప్రతీ ఏడాది హోలీ పండుగను పురస్కరించుకొని నక్కలగుట్టపై నిర్వహించే నర్సింహస్వామి జాతర అంగరంగవైభవంగా ముగిసింది. గురువారం రాత్రి నర్సింహాస్వామికి ఆలయకమిటీ బాధ్యులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గుడి ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు భక్తులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలపై పెద్ద ఎత్తున నృత్యాలు చేసుకుంటూ భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై కూచిపూడి జగదీష్, సిబ్బందితో బందోబస్తును నిర్వహించారు. అదేవిధంగా జాతరలో కళాబృందం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారదగణేశ్, ఆలయకమిటీ చైర్మన్వ్రి, ఉపసర్పంచ్ సార్యనాయక్, నర్సింహ, సక్యనాయక్, బద్రియ, శంకర్, వీరన్న, అమృ, స్వామి, బాబు, సిద్ధన రమేశ్, అమ్మ వీరస్వామి పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...