మతసామరస్యానికి ప్రతీక అన్నారం దర్గా


Sat,March 23, 2019 02:01 AM

పర్వతగిరి, మార్చి 22 : మతసామరస్యానికి ప్రతీకగా భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న అ న్నా రం షరీఫ్ యాఖూబ్ బాబా దర్గాలో నేటి సాయంత్రం నుంచి ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అన్నారంలో ప్రతి ఏటా ముస్లిం క్యాలెండర్ ప్రకారం రజభ్ మాసంలో యాఖూబ్‌షావళీబాబా ఉర్సు స్థానిక ముజావర్‌ల నేతృత్వంలో ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్సవాలు పెద్ద వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

నేటి సాయంత్రం నుంచి ఉత్సవాలు..
ప్రతీ ఏటా రజబ్‌మాసంలో దర్గా ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ గా వస్తుంది. నేటి నుంచి 25 వరకు ఉర్సు ఉత్సవాలను నిర్వహించనున్నారు. 23 న సంధల్ (గంధం) యాఖూబ్ షావళీ బాబా దర్గాకు సమర్పిస్తారు. 24 న దీపారాధన, మహాఅన్నదానం, 25 న ఖత్ముల్ ఖురాన్ పఠనం, దీపారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉర్సు ఉత్సవాల సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం ఖవ్వాళీ గాయకులు, ఫకీర్లు చేసే ఒళ్లు గగుర్లు పొడిచే విన్యాసాలు భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటాయి.

అన్ని ఏర్పాట్లు పూర్తి
ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓఎస్డీ ప్రత్యేకాధికారి ఎండీ ఖాసీం, ఉర్సు ఉత్సవాల ఇన్‌చార్జి ఖాజా నజ్‌మోద్దీన్, ఇన్‌స్పెక్టర్ ఆడికర్ రియాజ్‌పాషా, దర్గా సూపరింటెండెంట్ ముంతాజ్ తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు , యాత్రికులకు తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వసతి, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘనటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పర్వతగిరి సీ ఐ శ్రీధర్‌రావు, ఎస్సై వీరేందర్ తెలిపారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...