ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Fri,March 22, 2019 04:04 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశా రు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, భీమిని, వేమనపల్లి, నెన్నెల, కన్నెపల్లి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 3,14 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం నియోజకవర్గంలో ఎనిమి ది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు పోలింగ్ జరు గనుంది. ఎన్నికల నిర్వహణ కోసం బెల్లంపల్లిలో మూడు, భీమిని, తాండూర్, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి, నీల్వాయి కేంద్రంగా ఒక్కొ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలోని జిల్లా షరిషత్ బాలికల పాఠశాల్లో మూడు కేంద్రాలు ఒకే చోట ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బందిని నియమించారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 8 కేంద్రాలకు 8మంది పోలింగ్ అధికారులు, మరో 32 మంది సహాయ పోలీంగ్ అధికారులను నియమించారు. పోలింగ్ పూర్తిగా వెబ్‌క్యాస్టింగ్ ద్వారా నిర్వహిస్తారు. వీడియోగ్రఫీని కూడా నియమించారు. ఇందుకోసం 8మంది చొప్పున వెబ్‌క్యాస్టింగ్ సిబ్బందిని, మరో 8 మంది మైక్రోఅబ్జర్వవర్లను నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు చొప్పున పోలీస్ సిబ్బందిని బందోబస్తు కొరకు నియమించారు. 55 మందిని ఎన్నికల సిబ్బందిని నియమించా రు. అధికారులు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు నియమించిన సిబ్బంది ఎన్నికల సామగ్రితో విధుల్లో చేరారు.

కాసిపేట రూరల్ : పట్టభద్రుల ఓటర్లు 516, ఉపాధ్యాయ ఓటర్లు 67 మంది ఉండగా మొత్తంగా 583 ఓటర్లకు గానూ పోలింగ్‌కు సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఎన్నికల సిబ్బంది వివరించారు. తహసీల్దార్ ప్రసాద్ వర్మ, కాసిపేట ఎస్‌ఐ కే భాస్కర్‌రావు ఏర్పాట్లు పర్య వేక్షిం చారు. వీఆర్వో మురళి, రెవెన్యూ సిబ్బంది, సిబ్బంది ఉన్నారు.

నెన్నెలలో..
నెన్నెల : పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 163 మం ది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నెన్నెల జిల్లా పరిషత్ పాఠశాలలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తహసీల్దార్ ప్రకాశ్ తెలిపారు.160మంది పట్టభద్రులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకుంటారని పేర్కొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...