భారీగా నగదు, బంగారం పట్టివేత


Fri,March 22, 2019 04:04 AM

సీసీసీ నస్పూర్ : నస్పూర్‌లో పోలీసులు భారీగా నగదు, బంగారం పట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఐ క్రిష్ణకుమార్ ఆధ్వర్యంలో సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి, స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు తనిఖీలు చేపట్టగా నగదు, బంగారం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి నుం చి పోలీసులు సీసీసీ కార్నర్, తెలంగాణ తల్లి విగ్ర హం వద్ద గల జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని ఆపి సోదాలు చేశారు. బుధవారం అర్ధరాత్రి 1ః30గంటల ప్రాంతంలో ఉబెర్ క్యాబ్ టీఎస్ 13యూఏ 7178 నెంబర్ గల స్విఫ్ట్ కారును తనిఖీ చేశారు. కారులో రూ.26లక్షల 76వేల 200 నోట్ల కట్టలు, 543గ్రాముల బంగారం లభ్యమైంది. హైదరాబాద్ చార్మినార్‌కు చెందిన హరీశ్ అగర్వాల్, ఎస్కే హైదర్‌అలీ, నవాజ్ హైమద్ ఖాన్ కారులో బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. పట్టుకున్న నగదు, బంగారంపై ప్రశ్నించడంతో ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. వీటికి ఎలాంటి రసీదులు లేకపోవడంతో పోలీసులు నగ దు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నగదు, బం గారాన్ని పెద్దపల్లి పార్లమెంట్ ఫ్లయింగ్ స్కాడ్ ఇన్‌చార్జి హరీశ్‌కు అప్పగించారు. బంగారం విలువ రూ. 16లక్షల 29వేలు ఉంటుందని సీఐ క్రిష్ణకుమార్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా రామగుం డం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ రక్షిత కే మూర్తి, ఏసీపీ గౌస్‌బాబా నేతృత్వం లో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువగా నగదు తీసుకెళ్తే తప్పని సరిగా ఆధారాలు చూపాలనీ, లేదంటే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...