హోలీ వేడుకల్లో అపశృతి


Fri,March 22, 2019 04:03 AM

జైపూర్ : మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో హోలీ పండుగ పూట విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మాయ లక్ష్మణ్ (24) గోదావరిలో స్నానానికి వెళ్ళి గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన కిష్టాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. జైపూర్ ఎస్‌ఐ విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాయ పోచమల్లు మల్లమ్మ దంపతులకు నలుగురు సంతా నం అందులో రెండో వాడు లక్ష్మణ్ సీసీసీ ప్రాంతంలోని ల్యాబ్‌లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నా డు. హోలీ సందర్భంగా మధ్యాహ్నం వరకు స్నేహితులతో కలిసి సంబురాలు చేసుకుని కిష్టాపూర్ గోదావరిలోకి స్నానానికి వెళ్లాడు. గోదావరిలోని మడుగులో గల్లంతయ్యాడు. వెంట ఉన్న స్నేహితు లు కాపాడుదామని ప్రయత్నించి చివరకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మడుగులో ఈతగాళ్ల సాయంతో వెతకగా మూడు నాలు గు గంట అనంతరం లక్ష్మణ్ మృతదేహం లభ్యమైం ది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...