చేవెళ్ల అభ్యర్థి మనోడే..!


Fri,March 22, 2019 03:08 AM

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తేతెలంగాణ); చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డి వరంగల్ వాస్తవ్యులు కావడం విశేషం. కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) గొల్లపల్లికి చెందిన వారి కుటుంబం వరంగల్‌కు మకాం మార్చింది. తండ్రి రాజిరెడ్డి కాంట్రాక్టర్‌గా ఉండేవారు. తల్లి చంద్రకళ, ఆయనకు అన్న, తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. హన్మకొండలోని కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలో ఉండేవారు. ఇప్పటికీ ఆయన తల్లి ఇక్కడే ఉంటున్నారు. హన్మకొండలోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆతర్వాత హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ, పీజీ పట్టా పొందారు. అనంతరం వెటర్నరీ విభాగంలో డాక్టరేట్ చేసి కొంత కాలం వెటర్నరీ డాక్టర్‌గా పనిచేశారు. అనంతరం పౌల్ట్రీఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎస్‌ఆర్ విద్యా సంస్థల అధినేత ఎస్‌ఆర్ వరదారెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డితో కలిసి ఎస్‌ఆర్ హేచరీస్‌ను ప్రారంభించి తక్కువ కాలంలోనే విజయవంతమైన పౌల్ట్రీ రైతుగా గుర్తింపు పొందారు. దేశంలోనే టాప్ టెన్‌లో ఒకరిగా ఈ రంగంలో నిలిచారు.

చేవెళ్ల ప్రాంతంలో ఎక్కువ పౌల్ట్రీ ఫాంలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ప్రభుత్వానికి ఫౌల్ట్రీ రైతులకు వారధిగా ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. పౌల్ట్రీ రంగంలోనే కాకుండా ఆయన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి ఒకేషనల్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఎంతో మందికి శిక్షణ ఇప్పించారు. 2004లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత విధేయుడిగా కొనసాగారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...