ఆరు కేజీబీవీల్లో ఇంగ్లిష్ మీడియం


Fri,March 22, 2019 03:08 AM

-జీసీడీవో సంధ్యారాణి
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మార్చి 21: వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని ఆరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించనున్నట్లు జిల్లా బాలికల సంరక్షణ అధికారి సంధ్యారాణి తెలిపారు. గురువారం జీసీడీవో సంధ్యారణి నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 12 కేజీబీవీలు ఉండగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరు కేజీబీవీలల్లో 6వ తరగతి ప్రవేశాలను ఇంగ్లిష్ మీడియంలో తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఇందులో సంగెం, పర్వతగిరి, ఖానాపూర్, గీసుగొండ, ఆత్మకూరు, వర్ధన్నపేట కేజీబీవీలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో 6వ తరగతికి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలు జరగనున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లాలోని మూడు కేజీబీవీలల్లో ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యను ప్రారంభించినప్పటికీ వచ్చే విద్యాసంవత్సరంలో మరిన్ని కేజీబీవీలల్లో కూడా ఇంటర్ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరిన్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఇంటర్ విద్యను కూడా ప్రారంభిస్తామన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...