చెరువుల్లో జలకాల కోలాహలం


Fri,March 22, 2019 03:07 AM

నర్సంపేట రూరల్, మార్చి 21 : జిల్లాలో రెండో అతిపెద్ద చెరువైన నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో గురువారం జలకాల కోలాహలం నెలకొంది. హోలీ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన యువకులు, విద్యార్థులు, ప్రజలు మాధన్నపేట చెరువులో ఈతలు కొట్టారు. నర్సంపేట పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వారు భారీగా తరలివచ్చి, మాధన్నపేట చెరువులో జలకాలాడారు. చెరువుకట్టపై కొందరు విందు భోజనాలు ఏర్పాటు చేసుకొని ఉత్సాహంగా గడిపారు. నర్సంపేట టౌన్ సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై యుగేందర్, పోలీస్ సిబ్బంది మాధన్నపేట పెద్ద చెరువు కట్టపై పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువులో ఈతలు కొట్టే యువకులకు సూచనలు చేశారు.

పాకాలలో..
ఖానాపురం, మార్చి 21 : జిల్లాలోనే పర్యాటక ప్రదేశమైన పాకాలలో హోలీ పర్వదినం సందర్భంగా గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. నర్సంపేట డివిజన్‌లోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు హోలీ వేడుకలను జరుపుకుని పాకాలను వీక్షించేందుకు వచ్చారు. పాకాల కట్ట అందాలను పర్యాటకులు వీక్షించి, పాకాల తుంగబంధం తూములో ఈతలు కొట్టారు. మరికొందరు పాకాల సరస్సులో బోటు షికారు చేస్తూ ఆనందంగా గడిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...