తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు


Thu,March 21, 2019 01:20 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఐనవోలు, వర్ధన్నపేట మండలాల గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ, మిషన్‌భగీరథ పనులపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల సర్పంచ్‌లతో గ్రామాల్లో నీటి సరఫరా పరిస్థితిపై చర్చించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ఐనవోలు మండలంలో 80 శాతం వరకు పనులు పూర్తి చేసి గ్రామాలకు పూర్తిస్థాయిలో మిషన్‌భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని త్వరలోనే పరిష్కరించి, ప్రతీ ఇంటికి తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పారు. మండలంలోని కక్కిరాలపల్లి, ఒంటిమామిడిపల్లి, లింగమోరిగూడెం తదితర గ్రామాల్లో చిన్నపాటి సమస్యలు ఉత్పన్నమవుతున్నందున వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత డీఈ, ఏఈలకు ఆయన సూచించారు.

అలాగే, వర్ధన్నపేట మండలంలో మాత్రం చాలా గ్రామాల్లో ఇంకా మిషన్ భగీరథ పనులు పూర్తి కావల్సి ఉన్నందున వాటిని వేగవంతం చేయాలని డీఈ, ఏఈలకు ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన చోట మరిన్ని పైపులైన్లు వేసి గ్రామాలకు అవసరమైన నీటిని సరఫరా చేయాలన్నారు. పాత వాటర్‌ట్యాంక్‌లతో పాటు కొత్తగా నిర్మాణం పూర్తయిన వాటినలో నీటిని నింపి గ్రామాలకు సరఫరా చేయాలని సూచించారు. ఇల్లంద, ల్యాబర్తి, బండౌతాపురం, కాశగూడెం గ్రామాలతో పాటు వర్ధన్నపేట మున్సిపాలిటీలో కూడా తాగునీటి సమస్య ఉందని ఆయా సర్పంచ్‌లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ సమస్యలపై చర్చించి త్వరలోనే అన్ని గ్రామాలకు నీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్‌లు కూడా నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, వైస్ ఎంపీపీ మార్గం కౌసల్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మిషన్‌భగీరథ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...