పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి


Thu,March 21, 2019 01:20 AM

నర్సంపేట, నమస్తేతెలంగాణ : పోలింగ్ కేంద్రా ల్లో ఏర్పాట్లు చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగే పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు నర్సంపేట, నారక్కపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 22న సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో నర్సంపేటలోని బాలు ర ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రం నంబర్ తదిత ర వివరాలను రాసి పెట్టాలన్నారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గదుల ఏ ర్పాటును పరిశీలిస్తున్నట్లు ఆమె వివరించారు. ఓటర్లు సజావుగా ఓట్లు వేయడానికి అనుకూలంగా ఉందా..? లేదా..? అని తెలుసుకున్నారు. జిల్లాతో పాటు నర్సంపేటలో ఏర్పాటు చేసిన పో లింగ్ కేంద్రాల గదుల తాళాలను ఆయా పాఠశాలలు, కళాశాలల నుంచి సేకరించుకుని ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు పూ ర్తి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 11న జ రుగనుండడంతో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే అధికారుల నియామకం పూర్తి చేశామని అన్నారు. వారికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపా రు. ఎన్నికల్లో అధికారులు కల్పించాల్సిన సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఎన్ రవి, ఆర్జేడీ రాజీవ్, తహసీల్దార్ విజయభాస్కర్, హెడ్మాస్టర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి ..
ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న పదోతరగతి ప రీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ హరిత కోరారు. బుధవారం నర్సంపేట బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతన్న పదోతరగతి సెం టర్‌ను సందర్శించి తనిఖీ చేశారు. పరీక్షలు రాస్తు న్న విద్యార్థుల హాల్‌టిక్కెట్లను కూడా పరిశీలించా రు. విద్యార్థులకు లోటుపాట్లు రాకుండా తగు విధంగా చూడాలని హెచ్‌ఎంను ఆదేశించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...