మొక్కలు శ్రద్ధగా పెంచాలి


Thu,March 21, 2019 01:20 AM

- జిల్లా కలెక్టర్ ఎం హరిత
నర్సంపేట రూరల్ : గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రతీ నర్సరీలో మొక్కల పెంపకంపై ఉపాధి హామీ సిబ్బంది, వన సేవకులు ప్రత్యేక శ్రద్ధ వహించాల ని జిల్లా కలెక్టర్ ఎం హరిత సూచించారు. మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసి న గ్రామ నర్సరీని బుధవారం కలెక్టర్ హరిత డీఆర్డీవో సంపత్‌రావు, నర్సంపేట ఆర్డీవో రవితో కలిసి పరిశీలించారు. తొలుత నర్సరీ మొత్తం కలియ తి రిగి మొక్కల ఎదుగుదలను పరిశీలించారు. బ్యాగ్‌లల్లో ఎంత వరకు మట్టి నింపుతున్నారు..? విత్తనాలు ఎలా నాటుతున్నారు.. ఉపాధి హామీ సిబ్బందిని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా అ ధికారులకు, సిబ్బందికి నర్సరీలో మొక్కల పెంప కంపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతీ గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, అందు లో భాగంగా ఉపాధి హామీ పథకంలో నర్సరీల ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సరీ పర్యవేక్షణలో మండల స్థాయి అధికారులు, ఈజీఎస్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధవహించాలని సూచించారు. గతంలో నర్సరీలల్లో టేకు మొక్కలు మాత్రమే అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం చాలా రకాల పండ్లు, పూలు, నీడనిచ్చే వివిధ రకాల మొక్కలు నర్సరీ ల్లో పెంచుతున్న లిపారు. మొక్కలను నర్సరీలల్లో పెంచి, సంరక్షించి రానున్న మూడు నెలల్లో గ్రా మాల ప్రజలకు అందించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పిస్తూ వారు లబ్ధ్దిపొందేలా చూడాలన్నారు. రానున్న వర్షాకాలంలో లక్షలాదిగా మొక్కలు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వర్‌రావు, ఏపీడీ పారిజాతం, ఏపీవో పాతిమామేరి, గ్రామ సర్పంచ్ గొడిశాల రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు అనిత, కల్పన, ఈసీ పూల్‌సింగ్, టీఏలు భద్రు, వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఏలు గొడిశాల హేమలత, రాజు, సురేందర్, తదితరులున్నారు.

గిర్నిబావిలో వననర్సరీ పరిశీలన..
దుగ్గొండి : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం గ్రామానికో వన నర్సరి ఏర్పా టు చేసినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. మొక్కల పెంపకాన్ని నర్సరీ సిబ్బంది బాధ్యతాయుతంగా తీసుకోవాలని ఆమె సూచించారు. బుధవారం దుగ్గొండి మండలంలోని వరంగల్- నర్సంపేట ప్రదాన రహదారిలోని గిర్నిబావి వద్ద ఏర్పాటు చేసిన వననర్సరిని ఆమె స్థానిక అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు, ఎంపీడీవో గుంటి పల్లవి, తహసీల్దార్ మంజుల, ఏపీవో ప్రభావతి, గిర్నిబావి సర్పంచ్ కూస మమతారాజు, టీఏలు కట్టయ్య, సమ్మయ్యలు , రాజు, ఎఫ్‌ఏ బాలు, ఈజీఎస్ సిబ్బంది వన సేవకుడు పెండ్లీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...