ఫొటోగ్రఫీ.. చరిత్రకు ఆనవాళ్లు


Thu,March 21, 2019 01:19 AM

సిద్ధార్థనగర్, మార్చి 20: ఫొటోగ్రఫీ అంటే చరిత్రకు ఆనవాళ్లు అని, తెలంగాణ ప్రభుత్వం ఫొటోగ్రఫీలను ప్రోత్సహిస్తుందని తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. వరంగల్ జిల్లాలో ప్రపంచ వ్యాప్తంగా వంద మంది ఫొటోగ్రాఫర్లు హాజరై వరంగల్‌లో పురాతన కట్టడాలు, కాకతీయుల గూర్చి ప్రపంచానికి తెలియచెప్పడానికి మూడు రోజుల నుంచి జిల్లాలోని రామప్ప, కోటగుళ్లు, వేయిస్తంభాలగుడి, ఖిలావరంగల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆనాటి కాకతీయుల చెక్కిన శిల్పాలు, కట్టడాలను తమ కెమెరాల్లో బందించారు. ప్రపంచంలో అనేక చోట్ల ఎగ్జిబిట్లను ప్రదర్శించి కట్టడాల గూరించి తెలియచెప్పడానికి మొదటి సారిగా అడుగులు ముందుకు వేశారు. బుధవా రం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ముగిం పు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు అనాడు ఉద్య మ సమయంలో తెలంగాణ వస్తే ఏమస్తుంది.. ఇప్పుడు అందరం బాగు న్నాం కదా.. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు అవసరమా.. అంటు రాష్ట్ర వాసులను కించపరిచే వారు, కానీ ఉద్యమ సమయంలో వారికి ఒకటే సమాధానం చెప్పేవాళ్లం. 60 ఏళ్ల కాలంలో జరుగని కార్యక్రమాలు నేడు జరుగుతున్నాయని, మన రాష్ట్రం వైపు ప్రపంచం మొత్తం చూడటం, ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తెలంగాణ వస్తే ఏమస్తుంటే మరో మారు ఫొటోగ్రఫీ ద్వారా చూపెడుతున్నాం.

వెయ్యి మాటలు, అనేక వ్యాసాల్లో చెప్పలేని భావాలను ఒక్క ఛాయాచిత్రం చెబుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల జీవన శైలి, ప్రజల జీవన విధానం, చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిన కట్టడాలను ఫొటోలు తీయడం కాలాన్ని రికార్డు చేయడం లాంటిదన్నారు. వరంగల్‌కు చెందిన ఫొటోగ్రాఫర్లు కుసుమ ప్రభాకర్ తీసిన లంబాడీల జీవన చిత్రాలు, మధుగోపాల్ తీసిన వరంగల్ కోట చిత్రాలు, అరవింద్ ఆర్య తీసిన చారిత్రక కట్టడాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఫొటోగ్రాఫర్లు తీసిన చిత్రాల నుంచి మంచి ఫొటోలను ఎంపిక చేసి త్వరలో కాపీటెబుల్ బుక్‌ను తయారు చేస్తామని చెపారు. అనంతరం హరికృష్ణను తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ సభ్యులు జ్ఞాపికను అందచేసి సన్మానించారు.సమావేశంలో తెలంగాణ ఫొటోగ్రఫీ డైరెక్టర్ కొమ్మిడి విశ్వేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ సభ్యులు సుధాకర్‌రెడ్డి, వరంగల్ అసోసియేషన్ అధ్యక్షులు లింగమూర్తి, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ రహమాన్, తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ రావులపల్లి సునీత, వైల్డ్‌లైఫ్ బెంగళూర్ ఫొటోగ్రాఫర్ సతీశ్ పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...