నేటి నుంచి కొమ్మాల జాతర


Thu,March 21, 2019 01:19 AM

గీసుగొండ, మార్చి 20 : కొలిచిన వారికి కొంగుబంగారమైన కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాజాతర గురువా రం నుంచి ప్రారంభం కానుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే సుప్రసిద్ధ్ద పూణ్యక్షేత్రం కొమ్మాల ఆలయంలో ఏటా పాల్గుణ మాసంలో హోలీ పర్వదినం రోజున స్వామి వారి జాతర ప్రారంభమవుతుంది బ్రహ్మోత్సవాలు మొదలు నుంచి 20 రోజుల వరకు జాతర కొనసాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్ర జలతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు స్వామి వారి దర్శనం కో సం తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సకల ఏర్పాట్లను పూర్తి చేశారు. గురువారం అర్ధరాత్రి బండ్ల తిరుగుట కార్యక్రమంతో జాతర ప్రాంభమవుతుంది. ఈ సందర్భంగా భక్తులు గుర్రపు, ఏను గు విగ్రహాలతో కూడిన ఎడ్ల బండ్లను స్వామి వారి గుట్ట చుట్టూ తిప్పుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారికి అర్చకులు నిత్యవిధి, పర్వతబలి కార్యక్రమాలతో పాటు సింహవాహన వేడుకను వైభవంగా నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో స్వామి ని గుట్ట చుట్టూ ఉరేగించారు. స్వామివారిని దేవదాయశాఖ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమె మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు, ఆలయ మేనేజర్ కమల, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటిలింగారెడ్డి, అర్చకులు వెంకటాచార్యులు, వేణుగోపాలచార్యులు, కాండూరి రామాచార్యులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...