నేడు హోలీ వేడుకలు


Thu,March 21, 2019 01:19 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : హోలీ అంటేనే ఆనందోత్సాహాలు పంచే పండుగ.. రంగుల పండుగకు యువత ఉరకేలేస్తున్నది. ఈ సారి ఎక్కువగా సహజ సిద్ధమైన రంగుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రసాయనిక రంగుల వాడకంతో వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు తేల్చి చెబుతున్నారు. జిల్లాలో హోలీకి రంగుల అమ్మకాలు జోరందుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు జాజిరి ఆడారు. చివరి రోజు బుధవారం రాత్రి గ్రామ కూడళ్లలో కామదహనం జరిగింది. హోలీ పర్వదినం సాయంత్రం కొమ్మాలలో లక్ష్మీ నర్సింహాస్వామి జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున ప్రభబండ్లు పలు గ్రామాల నుంచి తరలివెళ్తాయి.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...