క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్


Wed,March 20, 2019 02:55 AM

-క్రికెట్ పోటీల ముగింపులో ప్రజాప్రతినిధులు పిలుపు
రాయపర్తి, మార్చి 19 : క్రీడాపోటీల్లో రాణించే యువత, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాయపర్తి గ్రామ సర్పంచ్ గారె నర్సయ్య, ఉప సర్పంచ్ మహ్మద్ మైమూద్‌పాషా తెలిపారు. మండల కేంద్రంలో యునైటెడ్ యూత్ అసోసియేషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ క్రీడాపోటీలు మంగళవారం ముగిసాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల కేంద్రానికి చెందిన జట్టు విజేతగా నిలువగా, ఆతిథ్య రాయపర్తి జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడారు. క్రీడల్లో రాణిస్తే యువతకు భవిష్యత్‌లో బంగారు అవకాశాలు రావడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు.

స్నేహపూర్వక వాతావరణంలో ప్రతీ క్రీడాకారుడు పోటీపడాలని సూచించారు. అనంతరం ప్రథమ విజేతగా నిలిచిన కురవి జట్టుకు రూ.15,116 నగదు పారితోషికంతోపాటు జ్ఞాపిక, రన్నరప్‌గా నిలిచిన ఆతిథ్య రాయపర్తి జట్టుకు రూ.10,116 నగదు పారితోషికంతోపాటు జ్ఞాపిక, తృతీయ విజేతగా నిలిచిన మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన జట్టుకు రూ.5,116 నగదుతోపాటు జ్ఞాపికలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన మహ్మద్‌రియాజొద్దీన్ (రాయపర్తి) కు రూ.2,016 నగదు పారితోషికంతోపాటు జ్ఞాపిక, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మన్నన్ (కురవి)కు రూ.1,016 నగదు పారితోషికంతోపాటు జ్ఞాపికను బహూకరించారు. పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు, బహుమతులు, నగదు పారితోషికాల దాతలు అయిత సంపత్‌కుమార్, రాంచందర్, బైరి వరుణ్‌కుమార్, బూరుగు నవీన్‌కుమార్, గుగులోతు విజయ్‌కుమార్, కోతి క్రాంతికుమార్, మహ్మద్‌అఫ్రోజ్‌ఖాన్, బొమ్మెర కల్యాణ్, కొండపల్లి సందీప్‌కుమార్, నూనె అనిల్‌కుమార్, బల్లెం రాజశేఖర్, ఉబ్బని కిశోర్‌కుమార్, మైస మహేందర్, మహ్మద్.మథిన్, వినయ్‌కుమార్, మన్నన్, ప్రభాకర్, గణేశ్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...