మారుమూల పల్లెల్లో పోలీసు కవాతు


Wed,March 20, 2019 02:54 AM

శాయంపేట, మార్చి 19 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని మారుమూల పల్లెలైన నేరేడుపల్లి, ప్రగతిసింగారంలో కేంద్ర పోలీసు బలగాలు మంగళవారం సాయంత్రం కవాతు నిర్వహించాయి. పరకాల ఏసీపీ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన 50 మంది సిబ్బందితో స్థానిక పోలీసులు రెండు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల్లో ప్రజలు భయపడకుండా ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఏసీపీ సుదీంధ్ర మాట్లాడుతూ వచ్చే నెల 11న పార్లమెంట్ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఎవరూ గొడవలకు దిగొద్దన్నా రు. కావాలని గొడవలు, అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఎన్నికల్లో పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసులు కూడా నిఘా పెట్టారని, ఎవరైనా అల్లర్లు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఏసీపీ హెచ్చరించారు. కార్యక్రమంలో శాయంపేట సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై జక్కుల రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...