ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు


Wed,March 20, 2019 02:54 AM

-జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి హెచ్చరిక
-ఊరుగొండలోని కర్ణాలకుంట భూముల పరిశీలన
దామెర, మార్చి 19: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం దామెర మండలం ఊరుగొండలోని కర్ణాలకుంట, కట్ట సర్వే నంబర్ 82లోని 11 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నదనే ఆరోపణలు రావడంతో జేసీ క్షేత్రస్థాయిలో కర్ణాలకుంట, కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాలకుంట ఫెన్సింగ్ వివరాలను తహసీల్దార్ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఐదు ఎకరాల మేరకు ఫెన్సింగ్ చేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు జేసీకి తహసీల్దార్ వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సర్వేనంబర్ 82లో ఉండాల్సిన ప్రభుత్వ భూమిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట పరకాల ఆర్డీవో కిషన్, తహసీల్దార్ నాగరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, వీఆర్‌వో శ్రీనివాస్, సర్వేయర్ కవిత తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...